హర్రర్ కామెడీ జానర్….మన దగ్గర అరిగిపోయి కరిగి పోయిన ఈ జానర్ లో సినిమాలు రావడం అన్నది ఆల్ మోస్ట్ ఆగిపోయింది కానీ కోలివుడ్ లో అడపాదడపా ఈ జానర్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి, రాఘవ లారెన్స్ మొదలు పెట్టిన ఈ జనార్ ని అక్కడ సుందర్ సి అనే డైరెక్టర్ కూడా క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నాడు. తెలుగు లో డబ్ అయిన కళావతి, చంద్రకళ లాంటి సినిమాలు…
తమిళ్ లో అరణ్మనై పేరుతో తెరకెక్కగా అక్కడ ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించగా రీసెంట్ గా ఇదే ఫ్రాంచేజ్ లో మూడో పార్ట్ అయిన అరణ్మనై 3 సినిమా ఆర్య మరియు రాశిఖన్న ల కాంబినేషన్ లో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా కానుకగా రీసెంట్ గా కోలివుడ్ లో…
డాక్టర్ కి పోటిగా రిలీజ్ అవ్వగా సినిమాకి అక్కడ ఆదరణ అదిరిపోయే రేంజ్ లో సొంతం చేసుకుంది. సినిమాను అక్కడ మొత్తం మీద 12.5 కోట్ల రేంజ్ రేటు కి అమ్మారట. టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 14 కోట్ల రేంజ్ లో ఉంటుందట. కాగా సినిమా కి టాక్ బాగుంది అనిపించేలా ఉండగా….
మొదటి రోజు సినిమా అక్కడ 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 4 రోజుల లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 15.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందట. కేవలం తమిళనాడులో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే… 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోవాల్సి ఉంటుంది…
4 రోజుల్లోనే సినిమా 15 కోట్లకు పైగా రికవరీ చేయగా మిగిలిన రన్ లో ఇంకా 9 కోట్లు వసూళ్లు రాబడితే అక్కడ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఇక అన్ని చోట్ల కలిపి వరల్డ్ వైడ్ 4 రోజుల కలెక్షన్స్ లెక్క 18 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కి 29 కోట్ల గ్రాస్ అవసరం, ఆ లెక్కన సినిమా ఇంకా 11 కోట్ల మేర గ్రాస్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది.