Home న్యూస్ అరణ్మనై4: యావరేజ్ మూవీ అన్నారు…అక్కడ 66 కోట్లు ఔట్ సామి!

అరణ్మనై4: యావరేజ్ మూవీ అన్నారు…అక్కడ 66 కోట్లు ఔట్ సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా…తెలుగులో బాక్(Baak) పేరుతో డబ్ అయిన ఈ సినిమా తెలుగులో రొటీన్ మూవీ అన్న టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పొచ్చు.

మొత్తం మీద సినిమా 12 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు వాల్యూ టార్గెట్ 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ మార్క్ ని మిగిలిన రోజుల్లో అందుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది.

సినిమా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించగా 12వ రోజు కూడా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని కొనసాగిస్తుంది. ఇక సినిమా మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Aranmani4(Baak) 12 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 43.50Cr
👉Telugu States- 4.00Cr
👉Ka+ROI – 4.05Cr
👉Overseas – 14.85Cr***(Updated)
Total WW collection –66.40CR(32.05CR~ Share) Approx

మొత్తం మీద సినిమా యావరేజ్ రెస్పాన్స్ తో కూడా 12 రోజుల్లో 66.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 18 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 14 కోట్ల రేంజ్ లో లాభంతో బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here