Home న్యూస్ బాలయ్యా….మజాకా….బ్రేక్స్ లేకుండా దుమ్ము లేపుతున్నాడు!

బాలయ్యా….మజాకా….బ్రేక్స్ లేకుండా దుమ్ము లేపుతున్నాడు!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అటు సినిమాలను ఇటు పాలిటిక్స్ ని పెర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేస్తూ 10 ఏళ్ల నుండి రెండింటిని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ఉండగా లేటెస్ట్ గా ఆంధ్రలో ఎలక్షన్స్ ఫీవర్ పెరిగి పోవడం, బరిలో బాలయ్య మరోసారి నిలవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి పాలిటికల్ కాంపెయిన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు…

ఎలక్షన్స్ రీసెంట్ గా కంప్లీట్ అవ్వగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్స్ అవ్వడంతో రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నారు…కొంత గ్యాప్ తర్వాతే తిరిగి షూటింగ్ లకు వెళ్ళాలని చూస్తూ ఉండగా బాలయ్య మాత్రం తన కమిట్ మెంట్స్ ప్రకారం ఎలాంటి బ్రేక్స్ లేకుండానే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యాడు.

ఆంధ్ర నుండి ప్రస్తుతం హైదరాబాదుకి వచ్చేసిన బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న తన లేటెస్ట్ మూవీ NBK109 షూటింగ్ లో ఈ వీకెండ్ లో తిరిగి ఎంటర్ కాబోతున్నాడట. ఏమాత్రం బ్రేక్స్ లేకుండా ఇన్ని రోజులు ఎన్నికల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు తిరిగి బ్రేక్స్ లేకుండానే…

తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా షూటింగ్ ను ఈ ఇయర్ లోనే కంప్లీట్ చేసి కుదిరితే దసరా టైంకి బాక్స్ ఆఫీస్ బరిలోకి దింపే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here