బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ అరణ్య, చాల కాలంగా రూపొందిన ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ కి సాలిడ్ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ నిరాశ పరిచింది, సినిమా ఇప్పుడు మొత్తం మీద మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకోగా…
ఓవరాల్ గా కలెక్షన్స్ ఏమాత్రం అంచనాలను, సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునే విధంగా అయితే లేవనే చెప్పాలి. సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 55 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా అది బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి సరిపోదు.
ఇక తమిళ్ వర్షన్ మొత్తం మీద 1 కోటి వరకు షేర్ ని సొంతం చేసుకున్నా కానీ తెలుగు లో సినిమా భారీగా నిరాశ పరిచింది, సినిమా 60 కోట్ల బడ్జెట్ తో రూపొందగా బిజినెస్ ఏమి జరగని ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 45 కోట్ల తర్వాత మిగిలిన 15 కోట్లకి…
మొత్తం మీద 15.5 కోట్ల టార్గెట్ కి అరణ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 84L
👉Ceeded: 37L
👉UA: 40L
👉East: 22L
👉West: 16L
👉Guntur: 32L
👉Krishna: 19L
👉Nellore: 10L
AP-TG Total:- 2.60CR (4.10Cr Gross~)
Ka + Roi: 1.32Cr
OS: 18L
Total World Wide: 4.10CR( 7CR~ Gross)
మొత్తం మీద 15.5 కోట్ల టార్గెట్ కి 3 రోజుల్లో 4.10 కోట్లు మాత్రమె రికవరీ చేసిన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కి 11.40 కోట్ల షేర్ ఇంకా కావాల్సి ఉంది, సినిమా పరిస్థితి చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఇక వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.