Home న్యూస్ “అతడే శ్రీమన్నారాయణ” మూవీ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

“అతడే శ్రీమన్నారాయణ” మూవీ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

        కన్నడ యూత్ సెన్సేషన్ రక్షిత్ శెట్టి అక్కడ కిరిక్ పార్టీ సినిమాతో చాలా ఫేమస్… ఈ హీరో మల్టీ టాలెంటెడ్… ఈయన నటించిన సరికొత్త సినిమా అతడే శ్రీమన్నారాయణ మంచి అంచనాల నడుమ రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇక ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, హిట్టా కాదా అన్న వివరాలు తెలుసుకుందాం పదండీ…

కథ విషయానికి వస్తే ఎక్కువగా చెబితే థ్రిల్ మిస్ అవుతుంది…ఇది ఒక ట్రెజర్ హంట్ కి సంభందించిన స్టొరీ… 2 గ్యాంగులు మధ్యలో ఒక పోలిస్… వీరందరూ ట్రెజర్ హంట్ చేస్తారు. ఫైనల్ గా ఎవరు కనిపెట్టారు, హిరోయిన్ కి ఈ గ్రూప్ కి లింక్ ఏంటి అన్న మరిన్ని ఆసక్తిని రేపే వివరాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా రక్షిత్ శెట్టి అదరగొట్టేశాడు, డైలాగ్స్ యాక్షన్ కామిక్ టైమింగ్ ఇలా అన్ని విషయాల్లో డిఫెరెంట్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శాన్వి ఉన్నంతలో ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు కూడా తమ తమ రోల్స్ వరకు మెప్పిస్తారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగుంది, సెకెండ్ ఆఫ్ చాలా ఎడిట్ చేసే సీన్స్ ఉన్నా చేయలేదు… కొంచం ఓపిక చేసుకుని చూస్తె అది కూడా పెద్దగా బోర్ కొట్టదు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు ఆకట్టుకుంది. ఇక కెమెరామెన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువ.

హాలీవుడ్ రేంజ్ ట్రెజర్ హంట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలో కమెరా యాంగిల్స్ కానీ టేకింగ్ కానీ అద్బుతంగా అనిపిస్తుంది. సినిమా మంచి 2K – 4K స్క్రీన్స్ లో చూస్తె ఆ ఫీల్ మరో రేంజ్ లో ఉంటుంది. ఇక డైరెక్షన్ పరంగా చిన్న కథనే అయినా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేసి తెరకెక్కించాడు.

మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… రక్షిత్ శెట్టి పెర్ఫార్మెన్స్, లైట్ కామెడీ, కెమరా వర్క్ అండ్ టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే లెంత్ ఎక్కువ అయింది, అలాగే కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేశారు.

ఇవి తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ లు లేవు. ఒక డిఫెరెంట్ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. కొంచం స్లో నరేషన్ ని ఓపిక చేసుకుని చూస్తె మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ తో థియేటర్ నుండి బయటికి రావచ్చు.

మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ [3 స్టార్స్]…. లెంత్ కొంచం తగ్గించి స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా మార్చుకుని ఉంటె సినిమా రేంజ్ మరింత ఎక్కువ ఉండేది. అయినా కానీ ఉన్నంతలో సినిమా ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫేట్ ఎలా ఉంటుంది రెగ్యులర్ ఆడియన్స్ మూవీ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here