రిపబ్లిక్ డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు 2 తమిళ్ డబ్ మూవీస్ రావాల్సి ఉండగా అందులో ఒకటి ధనుష్(Dhanush) నటించిన కెప్టెన్ మిల్లర్(Captain Miller) కాగా మరోటి శివ కార్తికేయన్(Siva Kartikeyan) నటించిన అయలాన్(Ayalaan Movie)….కెప్టెన్ మిల్లర్ మూవీకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా….
తమిళ్ లో పండగ అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్స్ నే సినిమా సొంతం చేసుకుంది, కానీ తెలుగు లో మాత్రం సినిమా మొదటి రోజు తర్వాత మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన తేరుకోలేక పోయింది, కానీ తమిళ్ లో అయలాన్ మూవీ మంచి కలెక్షన్స్ తో హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా తెలుగు లో కూడా..
సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వడంతో ఇక్కడ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు, టీం కూడా బాగానే ప్రమోట్ చేయడానికి ట్రై చేయగా రిలీజ్ చివరి నిమిషంలో ఫైనాన్స్ అండ్ ఇతర కారణాల వలన రిలీజ్ ఆగిపోయింది….కొత్త డేట్ ను మళ్ళీ త్వరలో చెబుతారని సమాచారం.
కానీ ఈ వీకెండ్ లో ధనుష్ మూవీ అంతగా ఆకట్టుకోక పోవడంతో అయలాన్ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే హనుమాన్ తర్వాత సెకెండ్ బెస్ట్ ఆప్షన్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి ఉండేది, రిపబ్లిక్ డే వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని అందుకుని ఉండేది కానీ ఇప్పుడు అనుకోకుండా బంగారం లాంటి అవకాశాన్ని సినిమా మిస్ చేసుకుందని చెప్పొచ్చు.