Home న్యూస్ గుంటూరు కారం-అల వైకుంఠపురంలో ని క్రాస్ చేసిందా…ఎప్పుడు!!

గుంటూరు కారం-అల వైకుంఠపురంలో ని క్రాస్ చేసిందా…ఎప్పుడు!!

0

సినిమాల ప్రమోషన్స్ కోసం పోస్టర్స్ లో వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ను వేయడం అన్నది ఎప్పటి నుండో ఉంటూ వస్తున్నదే, ఒరిజినల్ కలెక్షన్స్ కొన్న బయర్స్ కి అలాగే నిర్మాతకి తప్ప బయట వాళ్ళకి చాలా తక్కువగా తెలుస్తాయి కానీ పెరిగిన టెక్నాలజీ కారణంగా ఆన్ లైన్ లో సేల్ అవుతున్న టికెట్ సేల్స్ లెక్కలు…

ఆయా ఏరియాల లోకల్ ట్రాకర్స్ లెక్కలతో ట్రేడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ చాలా వరకు సినిమాల వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది చెప్పే అవకాశం ఉంటుంది, రీసెంట్ టైంలో వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో వేయడం వలన భగవంత్ కేసరి, సలార్ లాంటి సినిమాలు ట్రోల్ కి గురి అయ్యాయి…

Guntur Kaaram 9 Days Total WW Collections!

ఇప్పుడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం(Guntur Kaaram) విషయంలో కూడా ఇదే జరుగుతుంది, సినిమా తొలిరోజు నుండి కలెక్షన్స్ ని ఎక్కువగానే పోస్టర్స్ లో రిలీజ్ చేస్తూనే ఉండగా ట్రేడ్ లెక్కలు మాత్రం పూర్తి విరుద్దంగా ఉన్నాయి…ప్రతీ పోస్టర్ లో ఆల్ టైం రికార్డ్ ఫర్ రీజనల్ మూవీ అంటూ…ఇప్పుడు ఏకంగా…

250 కోట్ల పోస్టర్ ను దింపగా అది చూసి అందరూ శాకవుతున్నారు, చాలా వరకు ట్రేడ్ లెక్కల్లో సినిమా ఇంకా 180 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ లో ఉండగా ఏకంగా 250 కోట్ల గ్రాస్ అంటూ చెబుతున్నారు…. కానీ అదే టైంలో ఇది కూడా రీజనల్ మూవీలలో రికార్డ్ అంటున్నారు….

2020 టైంలో ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన అల వైకుంఠ పురంలో సినిమా టోటల్ రన్ లో 256 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది….160 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది, ఏ ఏరియాలో చూసుకున్నా ఏ వెబ్ సైట్ లో చూసినా ఆ సినిమా కలెక్షన్స్ కి గుంటూరు కారం కలెక్షన్స్ కి మధ్య తేడా చాలా ఉంది…

అయినా కూడా పోస్టర్స్ లో ఇలా భారీ వసూళ్ళని వేస్తూ ఉండటం ఇతర హీరోల ఫ్యాన్స్ చేత ట్రోల్ అయ్యేలా చేస్తుంది, ఇతర ఇండస్ట్రీ ల వాళ్ళు కూడా వీటిపై ట్రోల్స్ చేస్తున్నారు…. ఒరిజినల్ కలెక్షన్స్ నిర్మాతకే తెలుస్తాయి, కానీ ట్రేడ్ అంచనా కలెక్షన్స్ నిర్మాత రిలీజ్ చేసే కలెక్షన్స్ మధ్య తేడా 5-10% వరకు ఉంటే పర్వాలేదు…

కానీ ఇలా భారీ తేడా ఉండటం ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి, హనుమాన్(Hanuman) మూవీ వీర విహారం చేస్తూ 250 కోట్ల మార్క్ ని అందుకోగా మేకర్స్ వచ్చిన కలెక్షన్స్ ని రిలీజ్ చేస్తున్నారు, ట్రేడ్ లెక్కలు కూడా ఆల్ మోస్ట్ అదే విధంగా ఉన్నాయి. కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇలా పోస్టర్స్ వలన ట్రోల్స్ మరింత పెరిగి పోతున్నాయి.

Guntur Kaaram 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here