Home గాసిప్స్ మళ్ళీ ఆగిపోయిన బ్లాక్ బస్టర్ రీమేక్ మూవీ!

మళ్ళీ ఆగిపోయిన బ్లాక్ బస్టర్ రీమేక్ మూవీ!

0

ఈ ఇయర్ టాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సినిమాల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న రీమేక్…. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పునం కోశియుం అనే సినిమా. అక్కడ బిజు మీనన్ మరియు ప్రుద్వీరాజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మనిషి ఈగో మీద దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. ఇద్దరు హీరోలు నువ్వా నేనా అన్నట్లు పోటి పడి నటించారు.

ఇలాంటి సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలి అని ఫిక్స్ అవ్వగా బిజు మీనన్ రోల్ కి బాలయ్య ని ప్రుద్వీరాజ్ రోల్ కి రానా ని అనుకున్నారు. కానీ బాలయ్య నో చెప్పగా ఆ రోల్ కి వెంకటేష్ ని అనుకున్నారు.

   

వెంకీ మొదట్లో నో చెప్పడం తో రవితేజ ని అడగ్గా రెమ్యునరేషన్ మ్యాటర్ సెట్ కాక పోవడం తో తిరిగి వెంకటేష్ లైన్ లోకి రాగా… మళ్ళీ ఏమైందో ఏమో వెంకీ చేయడం లేదు అంటున్నారు. రానా రోల్ కాన్ స్టంట్ గా తనకే ఉండగా కమిట్ మెంట్స్ వల్ల రానా కూడా చేస్తాడో లేదో అన్న డౌట్ ఉందట.

దాంతో రీమేక్ మొదలు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్న టీం కి నిరాశే మిగలగా సినిమా రీమేక్ ప్రస్తుతానికి అటకెక్కినట్లే నని అంటున్నారు. స్టార్ కాస్ట్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాకే సినిమాను తిరిగి స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారట. నిర్మాత మాత్రం బిజు మీనన్ రోల్ కి ఎలాగోలా బాలయ్య ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

మరో పక్క ఈ సినిమా పై ఓ టాప్ హీరో కన్ను పడిందని, తను కూడా నటించాలని భావిస్తున్నాడని టాక్ ఉంది కానీ క్లారిటీ లేదు.. ఆ టాప్ స్టార్ ఎంటర్ అయితే టోటల్ స్టార్ కాస్ట్ మారాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉండగా అప్పటి వరకు ఈ సినిమా అటకెక్కినట్లేనని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎవరితో ఈ సినిమా మొదలు అవుతుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here