మే మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో తమిళ్ నుండి తెలుగులో డబ్ అయిన అరణ్మనై4(AranManai4 Telugu Review) తెలుగు డబ్ వర్షన్ బాక్(Baak Telugu Dub Review)….హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన సినిమా కాగా తమిళ్ తెలుగులో ఒకే రోజున రిలీజ్ అయిన సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే లాయర్ అయిన హీరో చెల్లి తమన్నా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కానీ అనుకోకుండా బాక్ అనే దుష్టశక్తి వలన తమన్నా తన భర్త చనిపోతారు…తన చెల్లి మరణానికి కారణాలు వెతికే క్రమంలో హీరోకి తెలిసిన నిజాలు ఏంటి ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
అలాగే సినిమాలో రాశిఖన్నా రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. టాలీవుడ్ లో అరిగిపోయిన హర్రర్ కామెడీ నేపధ్యంలోనే వచ్చిన బాక్ మూవీ పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు చాలా రొటీన్ పాయింట్ తో వచ్చిన మూవీ ఇది….
కానీ ఉన్నంతలో సుందర్ సి హీరోగా పర్వాలేదు అనిపించగా తమన్నా రోల్ బాగుంది… రాశిఖన్నా కూడా పర్వాలేదు అనిపించగా కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా నటించారు…సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి లౌడ్ గా ఉన్నా పర్వాలేదు….
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉండగా తెలుగు డబ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి….డైరెక్టర్ గా సుందర్ సి ఆల్ రెడీ అరిగి పోయిన స్టోరీ పాయింట్ తోనే తెరకేక్కినా కూడా పార్టు పార్టులుగా చూడటానికి బాగానే అనిపించిన సినిమా ఓవరాల్ గా మాత్రం గా ఈజీగా గెస్ చేసేలానే ఎక్కువ సీన్స్ ఉంటాయి…
ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో చాలా వరకు మెయిన్ కథలోకి వెళ్ళకుండా డ్రాగ్ చేసి క్లైమాక్స్ లో పర్వాలేదు అనిపించాడు డైరెక్టర్….మొత్తం మీద పెద్దగా ఎక్స్ పెర్టేషన్స్ ఏమి లేకుండా వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపిస్తుంది….మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….