Home న్యూస్ బచ్చల మల్లి-ముఫాసా ది లయన్ కింగ్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

బచ్చల మల్లి-ముఫాసా ది లయన్ కింగ్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో అల్లరి నరేష్(Allari Naresh) నటించిన  బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా మిగిలిన మూవీస్ తో పోల్చితే కొంచం జోరు చూపించవచ్చు అనిపించగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమా(Mufasa The Lion King) సినిమా…

మహేష్ స్టార్ డం పవర్ తో మంచి జోరుని చూపించాయి…మొత్తం మీద కొత్త సినిమాల అన్నింటి మీద పుష్ప2 డామినేషన్ కొనసాగగా ఆ సినిమా తర్వాత ప్లేస్ లో ముఫాసా మూవీ నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గా సాగిన ఈ సినిమాకి మొదటి రోజు..

ఆక్యుపెన్సీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే సొంతం అయ్యింది. కొత్త సినిమాలు అన్నింటి మీద బెటర్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని దాటడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా….

ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగి 1.8-2 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది…ఇక అల్లరి నరేష్ బచ్చల మల్లి బిలో పార్ ఆన్ లైన్ బుకింగ్స్ నే సొంతం చేసుకోగా కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…

మొదటి రోజు మొత్తం మీద ఇక్కడ 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 45 లక్షల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక మిగిలిన మూవీస్ లో ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు…

ఉన్నంతలో ఉపేంద్ర యు అండ్ ఐ మూవీ కొంచం పర్వాలేదు అనిపించేలా ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఆ సినిమా  55-60 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మహేష్ స్టార్ డం హెల్ప్ తో ముఫాసా స్ట్రాంగ్ స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక అన్ని మూవీస్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here