Home గాసిప్స్ 1st లుక్ రిలీజ్ కే బిజినెస్ ఔట్…అల్లరి నరేష్ మాస్ రాంపెజ్ ఇది!

1st లుక్ రిలీజ్ కే బిజినెస్ ఔట్…అల్లరి నరేష్ మాస్ రాంపెజ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత టైం తర్వాత రీసెంట్ గా ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie) అంటూ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన అల్లరి నరేష్(Allari Naresh) ఆ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్నా ఓవరాల్ గా టార్గెట్ ను అందుకోలేదు…ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ వరుస పెట్టి కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తాడు అనుకున్నా కూడా…

వెంటనే రా రస్టిక్ మూవీతో రచ్చ చేయడానికి సిద్ధం అయ్యాడు…అల్లరి నరేష్ నటించిన కొత్త సినిమా బచ్చల మల్లి(Bachhala Malli Movie) రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు…మాస్ లుక్ లో అల్లరి నరేష్ దుమ్ము లేపాడు అని చెప్పాలి. ఇక ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచనాలు పెరగగా…

మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మూవీతో తన లక్ ని పరీక్షించుకోబోతున్న అల్లరోడు ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే రచ్చ చేసి బిజినెస్ ను కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం, సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ను 5 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ బిజినెస్ లు మరో కోటి రేంజ్ కి పలికినట్లు సమాచారం.

దాంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోవడం విశేషం, జస్ట్ ఫస్ట్ లుక్ తోనే సినిమా బిజినెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటూ ఉండగా సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో మంచి మాస్ హిట్ ను అల్లరోడు సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here