Home న్యూస్ గోపీచంద్ “విశ్వం” టీసర్ 24 గంటల రెస్పాన్స్…మైండ్ బ్లాంక్ ఇది!

గోపీచంద్ “విశ్వం” టీసర్ 24 గంటల రెస్పాన్స్…మైండ్ బ్లాంక్ ఇది!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) హిట్ కొట్టి చాలా టైం అవుతుంది…అలాగే డైరెక్టర్ గా ఒకప్పుడు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన శ్రీనువైట్ల(Sreenu Vaitla) కూడా హిట్ కొట్టి చాలా టైం అవుతుంది. ఇలాంటి టైం లో ఈ ఇద్దరి కాంబోలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విశ్వం(Vishwam Movie)….శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా…

రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ సినిమా టీసర్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు….ఈ టీసర్ లో అందరికీ షాకిస్తూ హీరో అయిన గోపీచంద్ సామాన్య జనాల మీద గన్ తో దాడి చేసి అందరినీ చంపేసి అక్కడున్న ఫుడ్ ని తింటాడు… ఒక హీరో ఇలా నార్మల్ జనాలను చంపడం అన్నది మైండ్ బ్లాంక్ చేసింది అనే చెప్పాలి.

దాంతో సినిమా మీద అంచనాలను టీసర్ పెంచేసినా కూడా టీసర్ కి మాత్రం యూట్యూబ్ లో వచ్చిన రెస్పాన్స్ మాత్రం అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది…టీసర్ స్టైలిష్ గా అండ్ భారీ ట్విస్ట్ ఇచ్చేలా ఉంటూనే ఓ రేంజ్ లో సర్పైజ్ చేసినా కూడా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ టీసర్ కి 570K వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా…

లైక్స్ పరంగా 24 గంటల్లో కేవలం 15 వేల లైక్స్ మాత్రమే సొంతం అయ్యాయి. గోపీచంద్ ఛానెల్ లో ఆల్ మోస్ట్ 580K వ్యూస్ ను 18 వేల లైక్స్ ను మాత్రమే అందుకుంది…రీసెంట్ టైంలో ఒక నోటబుల్ హీరో మూవీకి ఇలాంటి రెస్పాన్స్ సొంతం అవ్వడం ఈ సినిమాకే చెప్పాలి. దాంతో ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎట్టి పరిస్థితులలో కంబ్యాక్ స్ట్రాంగ్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here