బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో చిన్న సినిమా(Balagam) ముందు నిలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
టోటల్ రన్ లో ఏకంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలవగా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
టెలివిజన్ లో కూడా వీర లెవల్ లో కుమ్మేస్తూ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 14.30 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఊహకందని రేంజ్ లో జోరు చూపించగా ఫస్ట్ టైం ఛానెల్ కి సినిమా సాలిడ్ గా లాభాలను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి.
ఇక రీసెంట్ గా సినిమా సెకెండ్ టైం కూడా టెలికాస్ట్ అవ్వగా రెండో సారి కూడా సినిమా హోల్డ్ అద్బుతంగా ఉందని చెప్పాలి. చాలా పెద్ద సినిమాలు రెండో సారికి భారీగా స్లో డౌన్ అయిపోతాయి. అలాంటిది బలగం మూవీ రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా…
9.08 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఈ రేంజ్ లో ఓ చిన్న సినిమా అద్బుతమైన హోల్డ్ ని చూపించడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఛానెల్ కి కూడా విపరీతమైన లాభాలను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి ఈ సినిమా…