ఈ ఇయర్ టాలీవుడ్ లో చిన్న సినిమాగానే రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో బలగం(Balagam) సినిమా ఒకటి… ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని సాలిడ్ గా సొంతం చేసుకోగా తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దుమ్ము దులిపేసింది. ఇక సినిమా టెలివిజన్ లో తర్వాత టెలికాస్ట్ అవ్వగా ఫస్ట్ టైమే స్టార్ మా ఛానెల్ కి భారీ ప్రాఫిట్స్ వచ్చే రేంజ్ లో…
14.30 టి.ఆర్.పి రేటింగ్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి 9.08 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దంచికొట్టింది.. ఛానెల్ కి అప్పటికే ఈ సినిమా ఊహకందని లాభాలను తెచ్చిపెట్టింది…
ఇక రీసెంట్ గా సినిమా మూడో సారి టెలికాస్ట్ అవ్వగా రెండో సారి కన్నా కూడా మూడో సారి టి.ఆర్.పి రేటింగ్ ఎక్కువగా సొంతం అవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి ఇప్పుడు. సినిమా మొత్తం మీద మూడో సారి టెలికాస్ట్ అయినప్పుడు…
9.88 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయడం విశేషం అని చెప్పాలి. ఈ రేంజ్ లో టెలివిజన్ లో ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ చిన్న సినిమాల్లో ఆల్ టైం ఎపిక్ హోల్డ్ తో దూసుకు పోతున్న సినిమా ఇదేనని చెప్పొచ్చు.