బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన బలగం మూవీ ట్రిమెండస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా మూడో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న సినిమా మేకర్స్ ఇప్పుడు సడెన్ గా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది ఇప్పుడు.
సినిమా ఒక పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్నా కానీ సినిమా డిజిటల్ రిలీజ్ ను మూడు వారాలు పూర్తీ అయిన వెంటనే చేశారు… ఎవ్వరూ కూడా ఇది ఊహించలేదు అని చెప్పాలి ఇప్పుడు. బహుశా మేకర్స్ కూడా సినిమా ఈ రేంజ్ లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ని కొనసాగిస్తుందని ఊహించలేదు ఏమో కానీ సినిమాను ఇప్పుడు 3 వారాలకు అమెజాన్ ప్రైమ్ లో సడెన్ గా డిజిటల్ రిలీజ్ అవ్వడంతో అందరూ ఆశ్యర్యపోయారు. సినిమా 20వ రోజు 1.76 కోట్ల గ్రాస్ ను 21వ రోజు 66 లక్షల గ్రాస్ ను అందుకుని సూపర్బ్ రన్ ని…
కొనసాగిస్తూ ఉండగా సడెన్ గా డిజిటల్ రిలీజ్ అవ్వడం బాక్స్ ఆఫీస్ రన్ పై గట్టి ఇంపాక్ట్ ని చూపబోతుంది. సినిమా ఒక్క నైజాంలోనే ఇప్పుడు 20 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తూ ఉందని అంచనా వేయగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ కి బ్రేక్ పడినట్లు అయిందని చెప్పాలి. మరి సినిమా డిజిటల్ రిలీజ్ ను తట్టుకుని కూడా బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.