Home న్యూస్ అక్కడ రికార్డులు తిరగ రాసిన బాలయ్య చెన్నకేశవ రెడ్డి!

అక్కడ రికార్డులు తిరగ రాసిన బాలయ్య చెన్నకేశవ రెడ్డి!

0

నట సింహం నందమూరి బాలయ్య వివి వినాయక్ ల కాంబినేషన్ లో 20 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా చెన్న కేశవా రెడ్డి. మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు బాగుంది అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టైం లో ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది. కానీ తర్వాత టైం లో ఫ్యాన్స్ కి ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిన ఈ సినిమా….

ఇప్పుడు రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తీ అవుతున్న నేపధ్యంలో రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయిన స్పెషల్ షోల ట్రెండ్ లో భాగంగా ఈ సినిమాను భారీ ఎత్తున స్పెషల్ షోలను ఇక్కడ అండ్ ఓవర్సీస్ లో ప్రదర్శితం చేస్తూ ఉండగా…

తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కొంచం అంతంత మాత్రమె ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా కి రెస్పాన్స్ అంచనాలను మించి ఉంది, అక్కడ మాస్ మూవీస్ ని పెద్దగా పట్టించుకోరు, అందునా ఈ సినిమా 20 ఏళ్ల క్రితం సినిమానే అయినా కానీ స్పెషల్ షోలు ఓ రేంజ్ లో పడగా ఇప్పటి వరకు అక్కడ…

స్పెషల్ షోల ద్వారా వచ్చిన గ్రాస్ అమౌంట్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. రీసెంట్ గా స్పెషల్ షోలు పడ్డ పోకిరి అక్కడ 16 వేల డాలర్స్ ను అందుకోగా జల్సా సినిమా 37.5 వేల డాలర్స్ ను అందుకుంది. ఇక ఇప్పుడు చెన్న కేశవ రెడ్డి ఏకంగా 40 వేల డాలర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఫైనల్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉందని అంటూ ఉండగా…

మొత్తం మీద సినిమా అక్కడ స్పెషల్ షోలతో కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. కానీ అదే టైం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే మాస్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అంతంతమాత్రమే సొంతం చేసుకుని పోకిరి, జల్సా లతో పోల్చితే ఇంపాక్ట్ తక్కువగానే ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here