నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా అప్ కమింగ్ మూవీస్ విషయం లో మాత్రం వరుస పెట్టి క్రేజీ కాంబినేషన్ లను సెట్ చేస్తూ ఫ్యాన్స్ తిరుగు లేని ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ అలాగే రూలర్ సినిమాలు భారీ డిసాస్టర్లుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే..
ఆ డిసాస్టర్ మూవీస్ తర్వాత బాలయ్య ఇప్పుడు తనకి సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమా చేస్తుండగా ఈ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని…
బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ నెల ఎండ్ వరకు ఆంద్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల గొడవ సద్దు మణిగితే అఖండ సినిమాను దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇది నిజం అవ్వడాని కి అవకాశం ఎంతైనా ఉన్నప్పటి కీ…
ఒకవేళ టికెట్ రేట్ల ఇష్యూ సెట్ కాని పక్షంలో మరోసారి సినిమా పోస్ట్ పోన్ అవ్వవచ్చు అంటున్నారు… ఇక అదే దసరా రోజున బాలయ్య కెరీర్ లో చాలా కాలంగా మిస్ అయిన యాక్షన్ ఎంటర్ టైనర్ స్టొరీ లైన్ తో అపజయం అంటే తెలియకుండా దూసుకు పోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయబోయే…..
అప్ కమింగ్ సినిమా అనౌన్స్ మెంట్ ని చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఈ సినిమాను నిర్మించబోతున్న షైన్ స్క్రీన్ నిర్మాతలు అఫీషియల్ గా కన్ఫాం చేశారు.. దాంతో దసరా టైం లో అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ బొనంజా అనిపించే విధంగా రెండు సినిమాలతో సందడి చేసే అవకాశం ఎంతైనా ఉంది..