బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు నట సింహం బాలకృష్ణ…బాక్ టు బాక్ హిట్స్ టి కెరీర్ లో పీక్ ఫామ్ లో ఉన్న బాలయ్యకి తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో ఒకప్పుడు వీక్ మార్కెట్ ఉండేది. సీడెడ్ లో ఎంతలా కుమ్మేసినా కూడా నైజాం మార్కెట్ లో మాత్రం బాలయ్య సినిమాలు కొంచం తక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకునేవి…
అఖండ ముందు వరకు ఇక్కడ బాలయ్య సినిమాలకు సాలిడ్ ఎదురుదెబ్బలు ఎక్కువగా తగిలేవి, కానీ అఖండ నుండి తన మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకు పోతున్న బాలయ్య నాన్ స్టాప్ గా 4 సినిమాలతో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకున్నాడు.
కానీ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ పరంగా ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో నంబర్ 1 గా నిలిచినా కూడా నైజాం లో అండర్ పెర్ఫార్మ్ చేసింది…అయినా కూడా ఓవరాల్ గా బాలయ్య లాస్ట్ 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 73 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి..
అఖండ మూవీ టోటల్ రన్ లో ఇక్కడ 21.17 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా 17.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక తర్వాత హాట్రిక్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమా 19.05 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా లేటెస్ట్ గా చేసిన…
డాకు మహారాజ్ మూవీ టోటల్ రన్ లో 15.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 73 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇక్కడ బాలయ్య 18.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటూ సీనియర్స్ లో ప్రస్తుతానికి బెస్ట్ యావరేజ్ తో దూసుకు పోతున్నాడు.. ఇక అఖండ2 తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.