నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా అఖండ, బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గానే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే రిలీజ్ అయ్యి పరుగును ముగించాల్సిన సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ ఆగిపోగా…
త్వరలోనే తిరిగి బాలెన్స్ షూటింగ్ ను పూర్తీ చేసి ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుంది. ఇక సినిమాకి అన్ని చోట్లా బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గానే వస్తున్నాయి. రీసెంట్ గా సినిమా మ్యూజిక్ రైట్స్ కింద 1.35 కోట్ల రేటు సొంతం అవ్వగా….
రీసెంట్ గా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా సాలిడ్ రేటు కి అమ్ముడు పోయినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ కి బోయపాటి సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, జయ జానకి నాయక, సరైనోడు సినిమాలు హిందీ లో ఓ రేంజ్ లో రికార్డులు కుమ్మేశాయి. ఇప్పుడు బాలయ్య తో చేస్తున్న అఖండ కి…
ఈ క్రేజ్ కారణంగా ఏకంగా 15 కోట్ల రేటు హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయ్యిందని అంటున్నారు. ఇది నిజంగానే మెంటల్ మాస్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్ రేటు క్రేజీ స్టార్ హీరోల మూవీస్ కి వస్తూ ఉంటాయి. కానీ అక్కడ బోయపాటి మూవీస్ కి ఉన్న క్రేజ్ దృశ్యా ఈ రేంజ్ రేటు ని ఇచ్చారని అంటున్నారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బాలయ్య అటు బోయపాటి వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న సాలిడ్ క్రేజ్ కూడా ఈ రేంజ్ బిజినెస్ కి మరో కారణం అయ్యి ఉండొచ్చు. ఇక సినిమా టీసర్ రిలీజ్ అయ్యాక క్రేజ్ మరింతగా పెరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సింహా లెజెండ్ ని మించి ఈ సినిమా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.