Home గాసిప్స్ లెక్కలన్నీ మారిపోయాయి…100 కోట్ల మాస్ పక్కా!!

లెక్కలన్నీ మారిపోయాయి…100 కోట్ల మాస్ పక్కా!!

0

బాలయ్య రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో లేడన్న విషయం అందరికీ తెలిసిందే, జై సింహా సినిమా తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ మరియు రూలర్ సినిమా లు రెండూ కూడా ఊహకందని ఫ్లాఫ్స్ అవ్వడం తో బాలయ్య మార్కెట్ కి భారీ ఎదురుదెబ్బ పడినట్లేనని అంతా భావించారు. దాంతో అప్ కమింగ్ మూవీ బోయపాటి తో…

ఉన్నా కానీ ఈ సారి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి సేఫ్ అవ్వాలి అని భావించి బడ్జెట్ ని రెమ్యునరేషన్ ని తగ్గించుకోబోతున్నారు అంటూ వార్తలు చాలానే వినిపించాయి వీరి కాంబినేషన్ లో సినిమా మొదలు అయ్యే టైం లో… బోయపాటి కూడా…

రీసెంట్ టైం లో హిట్స్ లేక పోవడం తో నిర్మాత కూడా తక్కువ బడ్జెట్ లోనే సినిమా తీయాలి అని భావించారు, కానీ కట్ చేస్తే బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అయిన చిన్న టీసర్ గ్లిమ్స్ ఇప్పుడు లెక్కలన్నీ మార్చేసింది. సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందొ నిరూపించింది.

బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ క్రేజ్ పవర్ తో సినిమా టీసర్ కి ఇప్పటికే 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం అయ్యాయి.. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ నుండి కూడా రెస్పాన్స్ సాలిడ్ పాజిటివ్ గా రావడం తో ఇప్పుడు సినిమా బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. టీసర్ రీచ్ బాగుండటం క్రేజ్ కూడా పెరగడం తో ఇప్పుడు…

బడ్జెట్ పెంచి మరింత క్వాలిటీ మూవీ ఇచ్చి పెర్ఫెక్ట్ రిలీజ్ డేట్ చూసుకుని సినిమా రిలీజ్ చేస్తే బాలయ్య కెరీర్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే సత్తా ఈ సినిమా కి రావడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. సింహా లెజెండ్ రేంజ్ కి తగ్గకుండా ఉంటే కచ్చితంగా లెక్క మరింత పెరిగడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here