Home గాసిప్స్ ఒరిజినలా…సెట్టా….తలపట్టుకున్న బోయపాటి!!

ఒరిజినలా…సెట్టా….తలపట్టుకున్న బోయపాటి!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా, లెజెండ్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు చేయని డిఫెరెంట్ రోల్ లో ఈ సినిమా లో కనిపించ బోతుండగా అందులో ఒక రోల్ అఘోరా రోల్ అన్న విషయం తెలిసిందే, ప్రస్తుతం ఇటు బాలయ్య కానీ అటు బోయపాటి కానీ ఫ్లాఫ్స్ లో ఉన్నారు.

బాలయ్య 2019 లో చేసిన మూడు సినిమాలు ఫ్లాఫ్ అవ్వడం తో ఆశాలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకోగా, సరైనోడు తర్వాత మళ్ళీ హిట్ కొట్టని బోయపాటి కూడా ఈ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా లో అఘోరా రోల్….

భారీ షెడ్యూల్ ఒకటి వారణాసి లో చిత్రీకరించగా మరో షెడ్యూల్ కి వెళ్ళాల్సి ఉన్న సమయం లో కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ పడటం అది ఇంకా కొనసాగుతుండటం ఈ సినిమా షూటింగ్ పై అది ఎఫెక్ట్ చూపడం ఖాయం అంటున్నారు. నార్త్ సైడ్ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం తో…

వారణాసి లో జరగాల్సిన మరో భారీ షెడ్యూల్ అంత ఈజీ గా సాగే అవకాశం లేదు, దాంతో రిస్క్ తీసుకుని అక్కడ షూట్ చేయాలా లేక భారీ సెట్ వేసి ఇక్కడే ఆ సీన్స్ ని చిత్రీకరించాలా అని తలపట్టుకున్నాడట బోయపాటి, బడ్జెట్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ ప్రస్తుతం ఫాం లో లేకున్నా కానీ…

బోయపాటి మరియు బాలయ్య కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ దృశ్యా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం. త్వరలోనే యూనిట్ వారాణసి వెళ్ళాలా లేక ఇక్కడే సెట్ వేయాలా అన్న నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here