Home గాసిప్స్ బాలయ్య ఫైనల్ డిసిషన్…నేను చేయను!!

బాలయ్య ఫైనల్ డిసిషన్…నేను చేయను!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ కి రీసెంట్ టైం లో అనుకున్న విధమైన ఫలితాలు అయితే దక్కలేదు, లాస్ట్ ఇయర్ ఎంతో ఆశపడి భారీ ఎత్తున చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ భారీ డిసాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ఫలితాన్ని మరిపించే కమర్షియల్ హిట్ కొడతామని చేసిన రూలర్ సినిమా కూడా భారీ డిసాస్టర్ అయ్యింది, ఇలాంటి టైం లో కొత్తగా చేసే సినిమాల విషయం లో బాలయ్య మరింతగా…

శ్రద్ధ తీసుకుని కథ లను ఎంచుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ముందుగా ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో హాట్రిక్ మూవీ చేస్తున్న బాలయ్య ఈ సినిమా తర్వాత కూడా చాలా నే కథలు వింటున్నా ఇంకా ఏవీ ఫైనల్ అయితే చేయలేదు.

కాగా రీసెంట్ గా బాలయ్య కి మలయాళ రీమేక్ ఆఫర్ వచ్చింది, మలయాళం లో రీసెంట్ గా సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం అనే సినిమా తెలుగు రీమేక్ లో బిజు రోల్ లో బాలయ్య ని తీసుకోవాలని రీమేక్ చేస్తున్న సితార ప్రొడక్షన్ వాళ్ళు చాలా ప్రయత్నాలే చేశారు. బాలయ్య కి ఎలాగోలా సినిమా చూపెట్టారట.

కానీ సినిమా చూసిన తర్వాత ఎందుకనో బాలయ్య ఈ రీమేక్ లో నేను నటించాను అని ఫైనల్ డిసిషన్ ని చెప్పేశాడట, ప్రొడ్యూసర్స్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నారట కానీ బాలయ్య మట్టుకు ప్రస్తుతం అయితే చేయను అని చెప్పి నో అన్నారని సమాచారం. బాలయ్య నో చెప్పడానికి కారణాలు ఏంటి అనేది క్లియర్ గా తెలియలేదు కానీ…

రీమేక్ కన్నా కొత్త కథలనే ఎంచుకోవాలి అన్న ఆలోచనలో బాలయ్య ఉన్నారని అందుకే నో చెప్పారని అని అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమాను చూసిన వాళ్ళు తెలుగు లో రీమేక్ చేస్తే ఆ రోల్ కి బాలయ్య పెర్ఫెక్ట్ అనుకున్నా ఇప్పుడు బాలయ్య నో చెప్పడం తో మిగిలిన హీరోల్లో ఎవరు సెట్ అవుతారో వెతికే పనిలో ఉన్నారు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here