Home TRP రేటింగ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ TRP…ఏడాది తర్వాత టెలికాస్ట్…అయినా కుమ్మింది!

అవెంజర్స్ ఎండ్ గేమ్ TRP…ఏడాది తర్వాత టెలికాస్ట్…అయినా కుమ్మింది!

1010
0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్…. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేస్ 1 లో చివరి సినిమా గా వచ్చిన ఈ సినిమా సాధించిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసిందే, వరల్డ్ వైడ్ గా 11 ఏళ్ల క్రితం ఊహకందని ఊచకోత కోసిన అవతార్ సినిమా సాధించిన కలెక్షన్స్ ని లాస్ట్ ఇయర్ బ్రేక్ చేసి నంబర్ 1 గా నిలిచి దుమ్ము లేపింది.

అవతార్ 2.78 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా 2.79 బిలియన్ డాలర్ మార్క్ ని అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఇండియా లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుంది. హిందీ సినిమాలనే టార్గెట్ చేస్తూ ఏకంగా ఇండియా లో…

364 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా తెలుగు లో కూడా ఈ సినిమా 13 కోట్ల మేర షేర్ ని వసూల్ చేసింది. ఇక ఇలాంటి విజయాన్ని అందుకున్న ఈ సినిమా టెలివిజన్ లో ఏడాది తర్వాత రీసెంట్ గా ఇండియా లో టెలికాస్ట్ అవ్వగా..

తెలుగు డబ్ కూడా స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యింది, ఇప్పటికే సినిమా ను అనేక సార్లు ఆన్ లైన్ లో చూసిన వాళ్ళు ఉన్నారు, ఇక టెలివిజన్ లో ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు తక్కువే అయినా ఈ సినిమా స్టార్ మా లో ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు వచ్చిన TRP రేటింగ్ బాగానే వచ్చింది అని చెప్పొచ్చు.

రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి 5.09 TRP రేటింగ్ దక్కింది. ఇది ఓ డబ్బింగ్ మూవీ కి సాలిడ్ రేటింగ్ అనే చెప్పాలి. హాలీవుడ్ డబ్ మూవీస్ కి తెలుగు లో అప్పుడప్పుడు మంచి రేటింగ్స్ దక్కుతున్నాయి, జంగిల్ బుక్ కి రీసెంట్ గా 6.4 రేటింగ్ దక్కగా ఇప్పుడు ఎండ్ గేమ్ సినిమా కి 5.09 రేటింగ్ దక్కింది. దాంతో మరిన్ని డబ్బింగ్ మూవీస్ ని టెలికాస్ట్ చేస్తున్నారు అన్ని ఛానెల్స్ వాళ్ళు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here