ప్రీ కోవిడ్ టైం వరకు కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లో ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ లో భీభత్సమైన ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా హాట్రిక్ విజయాల తర్వాత వచ్చిన సినిమానే అయినా కూడా…
రిలీజ్ కి ముందు ఆడియో అనుకున్న రేంజ్ లో క్లిక్ కాకపోవడం, ట్రైలర్ లో మరీ మాస్ ఎలిమెంట్స్ ఏమి పెద్దగా లేక పోవడంతో బాలయ్య వీర సింహా రెడ్డి లాంటి సంక్రాంతి మాస్ మూవీ తో పోల్చితే పెద్దగా బజ్ మ్యాచ్ చేయలేక పోయింది… కానీ ఇప్పుడు అలాంటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర…
అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు బాలయ్య… వీర సింహా రెడ్డి సినిమా మొదటి రోజున 25.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆ సినిమాతో పోల్చితే అంతగా బజ్ లేకపోయినా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో డాకు మహారాజ్ మూవీ ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఫస్ట్ డే ఏకంగా 25.72 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
ఒకసారి బాలయ్య రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్ లను గమనిస్తే…
#Balakrishna Recent Movies 1st Day Shares(AP-TG)
👉#DaakuMaharaaj – 25.72CR******
👉#BhagavanthKesari – 14.36CR
👉#VeeraSimhaReddy – 25.35CR
👉#Akhanda – 15.39Cr
👉#Ruler – 4.25Cr
👉#NTRMahaNayakudu – 2.12Cr
👉#NTRKathaNayakudu – 7.6Cr
కెరీర్ లో లోవేస్ట్ ఫేజ్ నుండి ఇప్పుడు కెరీర్ బెస్ట్ పీక్ ఫామ్ తో దూసుకు పోతున్న బాలయ్య ఇదే ఫామ్ ని అప్ కమింగ్ మూవీస్ కి కూడా కొనసాగిస్తే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డాకు మహారాజ్ లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.