Home గాసిప్స్ బాలయ్య “రూలర్” సెన్సార్ రిపోర్ట్…ఈ సారైనా కొడతాడా?

బాలయ్య “రూలర్” సెన్సార్ రిపోర్ట్…ఈ సారైనా కొడతాడా?

0

నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ పెద్దగా కలిసి రాలేదు, ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఎన్టీఆర్ బయోపిక్ లోని 2 పార్టులు కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించడంలో భారీ గా విఫలం అయ్యి భారీ డిసాస్టర్లు గా మిగిలి పోయాయి. ఇలాంటి టైం లో బాలయ్య మరో సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ చేస్తాడో లేదో అన్న అనుమానాలు రేకేత్తినా అందరి ముందుకు ఇప్పుడు రూలర్ తో వస్తున్నాడు.

ఈ నెల 20 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ దక్కగా, ట్రైలర్ అండ్ టీసర్ లలో బాలయ్య కొన్ని లుక్స్ తప్పితే ఒక్క కమర్షియల్ మూవీ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది రూలర్ సినిమా.

ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా అక్కడ నుండి వినిపిస్తున్న టాక్ కొంచం ఎంకరేజింగ్ గానే ఉంది. సెన్సార్ టాక్ ప్రకారం యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయని చెబుతున్నారు. స్టొరీ కూడా బాగుందని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు.

సినిమా ఓవరాల్ గా జై సింహా లా అన్ని అంశాలు కూడుకుని ఉన్న సినిమా అని బాలయ్య టోని స్టార్క్ లుక్ అండ్ సాఫ్ట్ నేపధ్యంలో సాగే సీన్స్ చాలా బాగా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఇవి హైలెట్ అవుతాయని వారు చెబుతున్నారు. ఇక సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా..

బాక్స్ ఆఫీస్ దగ్గర జై సింహా రేంజ్ టాక్ తెచ్చుకున్నా మాస్ లో బాలయ్య సినిమాలకు ఉండే జోరు దృశ్యా మంచి కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు. కానీ ఈ నెల 20 న ఏకంగా 4 పేరున్న మూవీస్ రిలీజ్ అవుతుండటం తో కలెక్షన్స్ పరంగా మరీ అద్బుతాలు నమోదు అవ్వడం కష్టం అని, టాక్ ఉన్న సినిమాలే లాంగ్ రన్ సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here