Home గాసిప్స్ 4 కోట్లు అనుకుంటే ఇప్పుడు రేటు తెలిస్తే మైండ్ బ్లాంక్!!

4 కోట్లు అనుకుంటే ఇప్పుడు రేటు తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవి కుమార్ డైరెక్షన్ లో జై సింహా లాంటి హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా రూలర్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా అఫీషియల్ టీసర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా కొన్ని షాట్స్ తప్పించి ఓవరాల్ గా టీసర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి.

దాంతో లోకల్ గా సినిమా మంచి బిజినెస్ జరుగుతుండగా ఓవరాల్ గా బిజినెస్ 25 కోట్ల లోపే జరిగేలా చేయాలి అంటూ బాలయ్య చెప్పగా లోకల్ బిజినెస్ ఎన్టీఆర్ బయోపిక్ వల్ల లాస్ అయిన వాళ్ళకే ఎక్కువగా ఇస్తుండగా ఓవర్సీస్ లో మాత్రం ముందుగా నిర్మాతలు 4 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ కోసం ఎదురు చూశారట.

అక్కడ రీసెంట్ టైం లో బాలయ్య మూవీస్ అన్నింటికీ నష్టాలు రాగా భారీ ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా అత్యంత భారీ డిసాస్టర్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రూలర్ పై పడి అసలు సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది అని సమాచారం.

దాంతో బిజినెస్ ఆఫర్స్ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన నిర్మాతలు అవి రావు అని కన్ఫాం చేసుకోగా ఇక అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ల తో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయాలని డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. దాంతో సినిమా బిజినెస్ ఓవర్సీస్ లో జీరో గా చెప్పుకుంటున్నారు.

సినిమా అక్కడ థియేటర్స్ రెంట్స్, పబ్లిసిటీ ఖర్చులు పోను ఎంత కలెక్ట్ చేస్తే అంత ఇప్పుడు నిర్మాతలకు వెళుతుంది, మరి బాలయ్య రూలర్ సినిమా అక్కడ ఎలాంటి ప్రదర్శనని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో మరో సినిమా తో పోటి లో డిసెంబర్ 20 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here