లాస్ట్ ఇయర్ విజయదశమి కానుకగా నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ డైరెక్షన్ లో వచ్చిన 17 ఏళ్ల క్రితం మూవీ నర్తనశాల మొదలయ్యి మధ్య లోనే ఆగిపోగా అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ని దసరా కానుకగా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, సాలిడ్ గా వ్యూస్ ని కూడా సొంతం చేసుకుని డిజిటల్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
బాలయ్య ఫుల్ ఖుషీ లో ఉండగా, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను మొదలు పెట్టాలి అన్న ఆసక్తి కలుగుతుందని రీసెంట్ గా చెప్పుకొచ్చారు బాలయ్య, ఇక ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ లో సాధించిన విజయం తో ఇప్పుడు ఇలానే మొదలయ్యి ఆగిపోయిన మరో సినిమాను….
ఇలానే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట బాలయ్య, బాలయ్య కోడిరామకృష్ణ కాంబినేషన్ లో మొదలయ్యి ఆల్ మోస్ట్ 60-70 శాతం దాకా షూటింగ్ ను జరుపుకున్న భారీ విజువల్ వండర్ విక్రమ సింహ భూపతి ను కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆపేశారు. కారణాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటికి రాకున్నా కానీ…
సినిమాలో అప్పటి వరకు షూట్ చేసిన విజువల్స్ మరో లెవల్ లో అప్పటి క్వాలిటీ కి మించి ఉంటాయని టాక్ ఉంది, దాంతో ఇప్పుడు అప్పుడు షూట్ చేసిన ఫూటేజ్ ను నర్తనశాల మాదిరిగా రిలీజ్ చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆ మూవీ ని ఆదరించే అవకాశం ఎంతైనా ఉంటుందని అనుకుంటున్నారట.
బాలయ్య కూడా ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది, చర్చలు అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ సినిమా కూడా నర్తనశాల మాదిరిగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. అది ఎప్పుడు అవుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. నర్తనశాల ను రిలీజ్ చేసినట్లే ఈ సినిమాను కూడా దసరా టైం కి ఆడియన్స్ ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం…