ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హిట్స్ తో దుమ్ము లేపిన మలయాళ ఇండస్ట్రీ నుండి లేటెస్ట్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) డైరెక్ట్ చేసిన సినిమా బరోజ్3D(Barroz3D Movie) గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ను అలరించే విషయంలో..
సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది ఇప్పుడు….సినిమాకి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ సొంతం అవ్వగా తర్వాత ఏ దశలో తేరుకోలేక పోయింది సినిమా…లాంగ్ 5 డేస్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా కంప్లీట్ గా ఔట్ అయిపొయింది ఇప్పుడు…
సినిమా 3 రోజుల్లో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన రెండు రోజుల్లో మరో 10 లక్షల గ్రాస్ ను అందుకుంది. షేర్ పెద్దగా ఏమి రాలేదు. ఓవరాల్ గా తెలుగు లో సినిమా డిసాస్టర్ గా నిలిచింది.
ఇక కేరళలో సినిమా 5 రోజుల్లో 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో 14 కోట్ల లోపే గ్రాస్ ను వసూల్ చేసింది. సినిమా కోసం ఆల్ మోస్ట్ 150 కోట్ల లోపు ఖర్చు చేశారని సమాచారం. ఆ బడ్జెట్ తో పోల్చితే వచ్చిన రికవరీ మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి.
సినిమా ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 25 కోట్ల రేంజ్ లో షేర్ ని అయినా అందుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన సినిమా ఇప్పటి వరకు 6 కోట్ల షేర్ ని కూడా సరిగ్గా అందుకోలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి.