Home న్యూస్ 1000 కోట్లకు 3 ఏళ్ళు!!

1000 కోట్లకు 3 ఏళ్ళు!!

1

     తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకున్న రోజులవి, ఇలాంటి సినిమా ఇది వరకు ఎన్నడూ చూడలేదని, ఈ క్రేజ్ ఇప్పట్లో మరే సినిమా కి కూడా సాధ్యం కాదని నిరూపించిన రోజులవి, ఒక తెలుగు మూవీ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీ లను షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ రికార్డులను తుడిచేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేసిన రోజులవి. టాలీవుడ్ ప్రైడ్ గా మారిన బాహుబలి 2 సృష్టించిన రికార్డులు ఎన్నో ఎన్నోన్నో…

వాటిలో మే 7 న ఇండియన్ సినిమా హిస్టరీ లో హిస్టారికల్ డే గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్ గా మహా అంటే 500 కోట్ల మార్క్ నుండి 600 కోట్ల దాకా వసూల్ చేశాయి. కానీ మే 7 వ రోజు బాహుబలి పార్ట్ 2 వరల్డ్ వైడ్ గా….

1000 కోట్ల మార్క్ ని అధిగమించి కేవలం 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ మూవీ గా నిలిచిన రోజు. అందులో ఇండియా లోనే 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి చరిత్ర తిరగరాసింది బాహుబలి 2 సినిమా.

మొదటి వారం హిందీ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 247 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల లోనే ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఇలా ఎన్నోన్నో రికార్డులను తిరగరాస్తూ లాంగ్ రన్ లో 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా…

ఇప్పటికీ ఇండియా లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది, వరల్డ్ వైడ్ గా చైనా లో దంగల్ సాధించిన కలెక్షన్స్ తో రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి 9 రోజుల్లో సాధించిన 1000 కోట్ల రికార్డ్ బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here