బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి తన రికార్డులకు ఎవ్వరూ అడ్డు లేరని మరోసారి నిరూపించుకున్నాడు, బాహుబలి 2 మూవీ ఓపెనింగ్స్ నుండి ఎండ్ వరకు ఆల్ టైం ఎపిక్ రికార్డులతో బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకోగా ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా కూడా రావడం కష్టమే అని అంతా అనుకున్నారు, కానీ రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్…
ఇప్పుడు రెండో వీకెండ్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. కాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో యావరేజ్ గా మొదటి 10 రోజుల కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 మూవీ ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా తర్వాత ఏ సినిమా కూడా బాహుబలి 2 రికార్డ్ ను అందుకోవడానికి కూడా ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా ఈ రికార్డ్ ను కూడా అందుకోలేదు కానీ బాహుబలి 2 సినిమా తర్వాత సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది…
బాహుబలి 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో ఓవరాల్ గా 525 కోట్ల రేంజ్ లో షేర్ ని 1050 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించగా… ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి 497 కోట్ల లోపు షేర్ ని అందుకోగా గ్రాస్ లెక్క ఏకంగా 900 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పాలి…
కాగా 10 రోజుల్లో యావరేజ్ గా బాహుబలి 2 మూవీ రోజుకి 105 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ రోజు కి యావరేజ్ గా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో యావరేజ్ గా మొదటి 10 రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డులను సృష్టించగా ఈ రెండు రికార్డులను సొంతం చేసుకున్న ఒకే ఒక్క డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి నిలిచాడు అని చెప్పాలి…