రిమార్కబుల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), నాలుగు వారాల్లో ఆల్ మోస్ట్ ప్రీమియర్స్ తో కలిపి 26 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని మాస్ ఊచకోత కోయగా బాహుబలి2 మూవీ ….
28 రోజుల పాటు ఈ రికార్డ్ ను అందుకుని ఇప్పటికీ టాప్ లో ఉండగా ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే షేర్ పరంగా బాహుబలి2 మూవీ ని ఆల్ రెడీ దాటేసి మాస్ రచ్చ చేసింది పుష్ప2 మూవీ….బాహుబలి2 మూవీ టోటల్ రన్ లో…
204 కోట్ల షేర్ ని అందుకుంటే పుష్ప2 మూవీ ఇప్పటి వరకు 221 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది, కానీ గ్రాస్ పరంగా మాత్రం బాహుబలి2 మూవీ 330 కోట్ల తో ఇంకొంత టైం టాప్ 2 లోనే ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసిన..
పుష్ప2 మూవీ ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 336 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని అటు షేర్ పరంగా ఇటు గ్రాస్ పరంగా ఆల్ టైం టాప్ 2 కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక టాప్ ప్లేస్ లో మాత్రం మమ్మోత్ కలెక్షన్స్ తో…
ఆర్ ఆర్ ఆర్ మూవీ అటు షేర్ పరంగా 272.31 కోట్లతో ఇటు గ్రాస్ పరంగా 415 కోట్ల గ్రాస్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉంది. పుష్ప2 మూవీ మిగిలిన రన్ షేర్ పరంగా మరో 51 కోట్ల షేర్ ని గ్రాస్ పరంగా 79 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇంకా…
అందుకోవాల్సిన అవసరం ఉండటం, ఇక రన్ కూడా సంక్రాంతి సినిమాల వలన స్లో డౌన్ అయిపోతుంది కాబట్టి టాప్ ప్లేస్ ఔట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి. అయినా కూడా ఈ రేంజ్ బిజినెస్ ను లాంగ్ రన్ లో దాటేసి ఆల్ టైం టాప్ 2 తో మాస్ ఊచకోత కోయడం మామూలు విషయం కాదు.