Home గాసిప్స్ BB3 మూవీ కి కథ ఇచ్చింది బోయపాటి కాదంట…ఈ ఫ్లాఫ్ డైరెక్టర్ అంట!

BB3 మూవీ కి కథ ఇచ్చింది బోయపాటి కాదంట…ఈ ఫ్లాఫ్ డైరెక్టర్ అంట!

0

బాలయ్య బోయపాటి ది టాలీవుడ్ లో వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్స్ లో ఒకటని చెప్పాలి… వీరి కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్లు గా నిలవగా రెండు సినిమాల కథలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. సింహా మరియు లెజెండ్ దేనికవే డిఫెరెంట్ గా ఉన్నా సెకెండ్ ఆఫ్ సినిమాలకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పొచ్చు.

కాగా ఈ రెండు సినిమాలకు కూడా కథలను బోయపాటి అందించలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. సింహా సినిమాకు కథను కొరటాల శివ అందించగా లెజెండ్ సినిమా కి ఎం రత్నం కథను అందించారు. కాగా ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ కి మాత్రం కథను…

ఓ ఫ్లాఫ్ డైరెక్టర్ అందించారని టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది… నాగ చైతన్య తో అప్పుడెప్పుడో బెజవాడ అనే అట్టర్ డిసాస్టర్ మూవీ ని రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కించిన వివేక్ కృష్ణ రాసిన కథను బోయపాటి బాలయ్య కి వినిపించగా… అందులో కొన్ని మార్పులు కోరిన బాలయ్య…

మళ్ళీ వివేక్ కృష్ణ చేసిన మార్పులు బాగా నచ్చడం తో ఈ సినిమా ను ఓకే చేశారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఇన్ని రోజులు కథ బోయపాటి రాసుకున్నారు అనే వార్తా చక్కర్లు కొట్టింది కానీ ఇప్పుడు అసలు నిజం ఇది అని అంటున్నారు. కథను అందించింది ఫ్లాఫ్ డైరెక్టర్ అయినా కానీ ఈ సారి కథలో…

సత్తా ఉందని, ఈ సినిమా వివేక్ కృష్ణ కి మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక స్క్రీన్ ప్లే మాత్రం ఈ సారి పూర్తిగా బోయపాటి భాద్యత తీసుకున్నారని అంటున్నారు. ఈ సారి కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతుండగా సినిమా త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here