కెరీర్ ని 2014 లో అల్లుడు శీను సినిమా తో మొదలు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమా హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు, తర్వాత జయ జానకి నాయక కూడా ఇలాంటి పరిస్థితి నే ఎదురుకోగా క్లిన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బెల్లం కొండ కి ఎట్టకేలకు 5 ఏళ్ళకి రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ దక్కింది.
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమా ను తెలుగు లో రాక్షసుడు పేరు తో రీమేక్ చేయగా సినిమా మంచి స్టార్ట్ ని సొంతం చేసుకున్నా మధ్యలో స్లో డౌన్ అవ్వగా తిరిగి తేరుకుని 50 రోజుల లాంగ్ రన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి బెల్లం కొండ కెరీర్ లో…
మొట్ట మొదటి క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా గా నిలిచింది. దాంతో ఇప్పుడు బెల్లం కొండ కి మళ్ళీ మంచి డిమాండ్ ఏర్పడగా ఒక్కో సినిమా రెమ్యునరేషన్ పరంగా భారీ రేట్లు చెబుతున్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. కొత్త కథలు తీసుకుని వస్తున్న వాళ్ళ కి బెల్లంకొండ….
7 కోట్ల రేంజ్ కి తగ్గకుండా రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు టాక్. కానీ రేట్లు విని నిర్మాతలు చాలా మంది వెనుకంజ వేస్తుండగా కొందరు నిర్మాతలు అంత అయితే కష్టం 5 కోట్ల రేంజ్ లో ఇచ్చుకుంటాం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. డానికి బెల్లంకొండ కూడా ఆల్ మోస్ట్ ఒప్పుకుంటున్నాడని సమాచారం.
కానీ ఒక్కో సినిమా 5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లం కొండ కన్నా కమర్షియల్ సూపర్ సక్సెస్ అయిన మిగిలిన టైర్ 2 హీరోలు కూడా అంతలా డిమాండ్ చేయడం లేదు.. కానీ మాస్ లో ముందు సినిమాలతోనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన బెల్లం కొండ సినిమా కి 5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకు పోతున్నాడు అని చెప్పొచ్చు.