2014 టైంలో అల్లుడు శీను(Alludu Seenu) సినిమాతో కెరీర్ మొదలు పెట్టినా కూడా 2019 టైంలో రాక్షసుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి హిట్ ను సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఆ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండగా…..
లాస్ట్ ఇయర్ హిందీలో ఛత్రపతి మూవీ రీమేక్ తో తన రేంజ్ ని పెంచుకోవాలి అని చూసినా ఆ సినిమాను అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత మళ్ళీ బాలీవుడ్ మూవీ గురించి ఆలోచించకుండా టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం…
భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీతో 159 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు(Tyson Naidu Movie) మూవీ చేస్తుండగా ఈ సినిమా తర్వాత కొత్త సినిమాను చావు కబురు చల్లగా సినిమా తీసిన కౌశిక్ డైరెక్షన్ లో ఉండబోతుండగా….
హర్రర్ కాన్సెప్ట్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుండగా ఈ సినిమా కోసం ఇప్పుడు ఆల్ మోస్ట్ 55-60 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మాణం చేస్తున్నారని అంటున్నారు. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ గా జరుగుతూ ఉండటంతో ఈ రేంజ్ రేటు కూడా రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో…
నిర్మాతలు పెడుతున్నారని టాలీవుడ్ లో టాక్ వస్తుండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తనకి ఈ రేంజ్ మార్కెట్ అయితే లేదనే చెప్పాలి. మరి ఈ భారీ బడ్జెట్ మూవీ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కంబ్యాక్ ను సొంతం చేసుకుని బడ్జెట్ కి న్యాయం చేసే కలెక్షన్స్ ని అందుకుంటాడో లేదో చూడాలి.