బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో రెండేళ్ళ క్రితం అల్లుడు అదుర్స్ సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత తెలుగు నుండి హిందీకి షిఫ్ట్ అయిన బెల్లంకొండ కొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో అక్కడ అద్బుతాలు సృష్టించాలి అనుకున్నా కూడా ఈ సినిమా హిందీలో అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ అఫీస్ దగ్గర ఓ కొత్త డైరెక్టర్ తో తెలుగు సినిమా చేస్తున్నాడు అన్నట్లు రీసెంట్ గా టాక్ వినిపించినా కూడా ఇప్పుడు తన కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్….
బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా చేసిన డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఇప్పుడు కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 159 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు అలాంటి భారీ సినిమా తర్వాత…
బెల్లంకొండ శ్రీనివాస్ తో భారీ బడ్జెట్ మూవీనే చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండి నాన్ స్టాప్ గా జరగబోతుండగా ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగులోనే తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ని బెల్లంకొండ శ్రీనివాస్ సొంతం చేసుకుంటాడో చూడాలి.