బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబినేషన్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) దసరా కానుకగా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
లాంగ్ రన్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా ఓపెనింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ లో జోరు చూపించక పోయినా కూడా లాంగ్ రన్ లో పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ స్టడీ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు 124 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా మిగిలిన రన్ లో దీపావళి సెలవుల అడ్వాంటేజ్ కూడా సినిమా కి ఉండబోతుంది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆ తర్వాత స్లో అయ్యే అవకాశం ఉండగా సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా…
సినిమా డిజిటల్ రైట్స్ ను సాలిడ్ రేటు చెల్లించి సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన 5 వారాల గ్యాప్ తర్వాత డిజిటల్ రిలీజ్ కి డీల్ జరిగింది అని సమాచారం. ఆ లెక్కన సినిమా ఇప్పుడు ఈ నెల 22-23 టైం లో డిజిటల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…
కాగా ఈ గ్యాప్ లో సినిమాకి దీపావళికి రిలీజ్ అయ్యే కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగించే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఈ మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.