Home న్యూస్ చిరు రికార్డ్ ను బ్రేక్ చేసిన భగవంత్ కేసరి టీసర్!!!

చిరు రికార్డ్ ను బ్రేక్ చేసిన భగవంత్ కేసరి టీసర్!!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అఫీషియల్ టీసర్ ను బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా ఈ టీసర్ కి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు కూడా ఎక్స్ లెంట్ గా…

రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా టీసర్ కి యూట్యూబ్ లో రికార్డు లెవల్ లో వ్యూస్ కూడా సొంతం అవుతూ ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ వ్యూస్ ను 24 గంటల్లో సొంతం చేసుకున్న…

God Father 2 Week (14 Days) Total WW Collections!!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లాస్ట్ ఇయర్ మూవీ గాడ్ ఫాదర్(God Father) మూవీ టీసర్ నెలకొల్పిన 8.71 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను బ్రేక్ చేసింది… ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడమే కాదు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల టీసర్ ల పరంగా…

మొట్ట మొదటి సారిగా 10 మిలియన్ మార్క్ ని కూడా క్రాస్ చేసిన సినిమాగా నిలిచిన భగవంత్ కేసరి సినిమా టీసర్ ప్రస్తుతానికి 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతూ 24 గంటల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

భగవంత్ కేసరి వ్యూస్ పరంగా కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసినప్పటికీ కూడా లైక్స్ పరంగా మాత్రం చాలా వెనకబడే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఒక రికార్డ్ అయితే బ్రేక్ అవ్వగా మొత్తం మీద 24 గంటల తర్వాత రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా దసరా బరిలోకి నిలుస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here