లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్స్ మూసే ఉండటం తో సినిమాలు ఎక్కువగా చూసే ఆడియన్స్ అందరూ ఇప్పుడు OTT లో ఏ సినిమా వదలకుండా చూస్తున్నారు, అదే టైం లో OTT లో వచ్చే కొత్త సిరిస్ లను కూడా చూస్తూ టైం గడిపేస్తున్నారు, రీసెంట్ టైం లో నెట్ ఫ్లిక్స్ లో మోస్ట్ హైప్ తో వచ్చిన సిరీస్ “భేతాళ్”… సినిమా నే 4 పార్టులుగా సిరీస్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంటుంది.
మరి ఈ సిరీస్ ఎలా ఉంది, హైప్ అందుకుందా లేదా అన్న వివరాల్లోకి వెళితే… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… 1857 టైం లో బ్రిటిష్ కల్నల్ ఒక బ్లాక్ మ్యాజిక్ ఉపయోగిస్తాడు… కానీ ఆ పవర్ మొత్తం తన వశం అవ్వాలి అంటే ఒక అమ్మాయిని బలి ఇవ్వాలి..
ఈ విషయం తెలుసుకున్న ఆదివాసియులు ఆ ప్రదేశాన్ని మొత్తం మూసేస్తారు… కట్ చేస్తే తర్వాత ఓ వ్యాపారీ తన స్వలాభం కోసం స్పెషల్ పోలిస్ బ్యాచ్ తో కలిసి ఆదివాసియులను నక్సల్స్ గా మార్చి కొందరిని చంపి ఆ మూసేసిన ప్రదేశాన్ని తెరుస్తారు. తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ.
జాంబీస్ నేపధ్యం లో తెరకెక్కిన ఈ సిరీస్ చాలా ఆసక్తిగా మొదలు అవ్వగా అక్కడక్కడా పట్టు కోల్పోయినా కొన్ని అద్బుతమైన సీన్స్ తో మళ్ళీ ఆసక్తిని పెంచుతూ చివరి వరకు ఏం జరుగుతుందా అన్న ఇంట్రెస్ట్ ని కొనసాగిస్తుంది కానీ చివర్లో క్లైమాక్స్ ని అనుకున్న రేంజ్ లో తీయలేకపోయారు అనిపిస్తుంది.
అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కానీ ప్రింట్ మాత్రం చాలా డిం గా ఉంటుంది, దాదాపు నైట్ టైం లో నే షూట్ చేయడం తో చాలా సీన్స్ క్లియర్ గా కనిపించవు కూడా.. అయినా అందరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా ఎవ్వరూ మనకు పెద్దగా పరిచయం లేని వారు అవ్వడం పెద్దగా రిజిస్టర్ కారు.
ఉన్నంతలో చిన్న అమ్మాయి, అలాగే విలేజ్ అమ్మాయి ఆకట్టుకోగా మిగలిన వాళ్ళు పర్వాలేదు అనిపిస్తారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండగా, కొన్ని సీన్స్ కి బయం గట్టిగానే వేస్తుంది. ప్రింట్ కొంచం బెటర్ గా తీసి ఉండి, క్లైమాక్స్ కొంచం బెటర్ గా ఎక్స్ ప్లైన్ లేదా ఇంప్రూవ్ మెంట్ తో తీసి ఉంటే సిరీస్ మరింత బాగుండేది.
కానీ ఉన్నంతలో ఓవరాల్ గా 40 నిమిషాల ఒక ఎపిసోడ్ టోటల్ గా 4 ఎపిసోడ్స్ కలిపి చూస్తె 2 గంటల 40 నిమిషాల లెంత్ లో టైటిల్స్ కి ఓ 20 నిమిషాలు తీసేస్తే 2 గంటల 20 నిమిషాల ఓవరాల్ లెంత్ లో 2 గంటలు కచ్చితంగా మనల్సి ఆకట్టుకుంటూ తర్వాత ఏం జరుగుంది అన్న ఆసక్తిని పెంచుతుంది భేతాళ్ సినిమా.(నోట్: డైలాగ్స్ చాలా చోట్ల మరీ పచ్చిగా ఉంటాయి…అవి గమనించగలరు)
హర్రర్ అండ్ జాంబీస్ మూవీస్ ఇష్టపడే వారికి, ప్రస్తుతం ఏం చూడాలో తెలియక ఉన్న వారికి కచ్చితంగా భేతాళ్ ఓ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కొన్ని నిమిషాలు టేకాఫ్ కి టైం తీసుకున్నా తర్వాత కచ్చితంగా క్లైమాక్స్ వరకు కచ్చితంగా కదలకుండా చూసేలా చేస్తుంది ఈ సినిమా… మీకు నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే కచ్చితంగా చూడండి..