ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో ఓపెన్ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంట్రీ.
షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్ తీసుకుంటాడు. పోలీస్ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ గ్లింప్స్ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథే ఇది. విలేజ్‌లో డిటెక్టివ్ ఏంటి అనిపిస్తుంది కదా..! అదే డైరెక్టర్ వినూత్నంగా ప్రెజెంట్ చేశారు.
థ్రిల్ కలిగించే ఎంటర్టైన్మెంట్ చిత్రమే ఈ భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.