Home న్యూస్ థియేటర్స్ లో చూడలేదు….ఇప్పుడ రెస్పాన్స్ మాత్రం కుమ్మిందిగా!

థియేటర్స్ లో చూడలేదు….ఇప్పుడ రెస్పాన్స్ మాత్రం కుమ్మిందిగా!

0

అన్ సీజన్ లో వచ్చే సినిమాల్లో చాలా సినిమాలు ఆడియన్స్ అంచనాలను అందుకోవు, ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చినా కూడా ఫ్లో లో ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అవుతాయి, కానీ అవే సినిమాలు డిజిటల్ లోనో…

లేక టెలివిజన్ లోనో రిలీజ్ అయినప్పుడు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి… లేటెస్ట్ గా ఇలాంటిదే జరిగింది…. అన్ సీజన్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana OTT Response) ట్రైలర్ ఆకట్టుకున్నా జనాలు థియేటర్స్ కి రాలేదు…

దాంతో రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ సొంతం అయినా కూడా భూతద్దం భాస్కర్ నారాయణ కి ఓవరాల్ గా నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అవ్వగా రీసెంట్ గా సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయింది. ఆహా వీడియోలో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ మాత్రం సినిమాకి రెస్పాన్స్ చాలా వరకు పాజిటివ్ గా ఉంది…

ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో జరిగే సీరియల్ కిల్లర్ హత్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొంచం పడుతూ లేస్తూ స్క్రీన్ ప్లే సాగినా కూడా చాలా వరకు కథ ఎంగేజింగ్ గా ఉండటంతో ఓవరాల్ గా డిజిటల్ చూసిన ఆడియన్స్ నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది…

బహుశా హీరో ఎవరైనా తెలిసిన వాళ్ళు అయ్యి మంచి మేకర్స్ చేతిలో సినిమా పడి ఉంటే మంచి రీచ్ ను సొంతం చేసుకుని ఉండేదని చెప్పొచ్చు… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయినా కూడా ఇప్పుడు డిజిటల్ లో మాత్రం భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది. ఫ్రీ టైంలో మీరు కూడా ఒక లుక్కేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here