Home న్యూస్ భ్రమ యుగం సినిమా టాక్ ఏంటి…..సినిమా హిట్టా-ఫట్టా!!

భ్రమ యుగం సినిమా టాక్ ఏంటి…..సినిమా హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మలయాళంతో పాటు ఇతర సౌత్ భాషల్లో ఒకే సారి రిలీజ్ అవ్వాల్సిన క్రేజీ మూవీ భ్రమయుగం(Bramayugam Movie Review in Telugu)…మలయాళ టాప్ స్టార్స్ లో ఒకరైన మమ్ముట్టి(Mammootty) తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది డిఫికల్ట్ రోల్ లో కనిపించిన ఈ సినిమా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో తెరకెక్కింది…

సౌత్ భాషలు అన్నింటిలో ఒకేసారి రిలీజ్ కాకపోయినా కూడా మలయాళంలో సజావుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇతర సౌత్ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ఇక మలయాళంలో సినిమా కి రెస్పాన్స్ మాత్రం యునానిమస్ గా వినిపిస్తూ ఉండటం ఇప్పుడు విశేషం అని చెప్పాలి…

కథ పాయింట్ కి వస్తే కేరళలో బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో ఒక పాత ఇంట్లో తన వంట వాడితో ఉండే హీరో దగ్గరకి అనుకోకుండా ఒక వ్యక్తి వస్తాడు….హీరో తన ఇంట్లో ఆ వ్యక్తి ఉండటానికి ఒప్పుకుంటాడు, కానీ తర్వాత ఆ ఇంట్లో ఎదో మిస్టరీ ఉందని అక్కడ నుండి తప్పించుకోవలాని ఎంత ట్రై చేసినా ఆ వ్యక్తి తప్పించుకోలేదు…ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

చాలా తిన్ స్టొరీ పాయింట్ తో వచ్చిన ఈ సినిమాను డైరెక్టర్ ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్లే తో చాలా వరకు బోర్ ఫీల్ అవ్వకుండా రాసుకున్నాడు, బ్లాక్ అండ్ వైట్ కలర్ అయినా కూడా చాలా వరకు సీన్స్ కొత్తగా డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కి కలిగించేలా ఉండటం విశేషం…. కొంచం సీన్స్ రిపీటివ్ గా అనిపించడం, కొన్ని చోట్ల కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా…

ఎక్కడా పెద్దగా వంక పెట్టడానికి లేకుండా భ్రమయుగం సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ కి ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు… ఇక మమ్ముట్టి పెర్ఫార్మెన్స్, విలనిజం, భయపెట్టేలా నవ్వే సీన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు…. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా..

రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కి ఒక కొత్త తరహా మూవీ చూడాలి అనుకుంటే మాత్రం భ్రమ యుగం ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ను కూడా థ్రిల్ అయ్యేలా చేసే సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఈజీగా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here