Home న్యూస్ అక్కడ కుమ్ముతున్న భ్రమయుగం….తెలుగు లో మాత్రం మైండ్ బ్లాంక్ రిజల్ట్!

అక్కడ కుమ్ముతున్న భ్రమయుగం….తెలుగు లో మాత్రం మైండ్ బ్లాంక్ రిజల్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఎక్స్ పెరిమెంటల్ మూవీ భ్రమయుగం(Bhrama Yugam Movie) వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమాకి వచ్చిన రివ్యూలు రేటింగ్ లు చూసి తెలుగు లో కూడా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపెడుతుంది అనుకున్నా కూడా తెలుగు మాత్రం సినిమాకి అన్ సీజన్ అండ్ సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే సినిమా తెలుగు లో ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా రిలీజ్ అయిన వీకెండ్ మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో….

35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది. తెలుగు లో ఓవరాల్ షేర్ 15 లక్షల రేంజ్ లోనే ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద తెలుగు లో కూడా సినిమాకి రివ్యూలు రేటింగ్ లు పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద ఇక్కడ రెస్పాన్స్ మాత్రం…

పెద్దగా ఇంపాక్ట్ ఏమి అయితే చూపించలేదు అనే చెప్పాలి. తెలుగులో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా నిర్మాతలే అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో వాళ్ళకి పెద్దగా థియేట్రికల్ రన్ మీద అంచనాలు లేవు కాబట్టి పెద్దగా నష్టలేమి ఉండవని చెప్పొచ్చు. నాన్ థియేట్రికల్ రైట్స్ తో సినిమా కి డీసెంట్ రికవరీ ఉండే అవకాశం ఉంటుంది.

బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం మంచి రివ్యూలు రావడంతో ఇంకా బెటర్ వసూళ్ళని అయితే అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అలా ఏమి జరగలేదు అని చెప్పాలి. కానీ మలయాళంలో మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here