Home న్యూస్ ఇది కదా ట్రైలర్ అంటే….భూల్ భులయ్య3 ట్రైలర్ రివ్యూ!!

ఇది కదా ట్రైలర్ అంటే….భూల్ భులయ్య3 ట్రైలర్ రివ్యూ!!

0

సౌత్ లో ఒకప్పుడు వాడి వాడి అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపొయింది, కానీ బాలీవుడ్ లో ఇప్పుడు అలాంటి జానర్ లోనే వచ్చిన మూవీస్ ని ఎగబడి చూస్తున్నారు, లేటెస్ట్ గా బాలీవుడ్ లో స్త్రీ యూనివర్స్ లో భాగంగా వచ్చిన స్త్రీ2 మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది…

ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో రచ్చ లేపే అవకాశం ఉన్న మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీ భూల్ భులయ్య3(Bhool Bhulaiyaa 3 Trailer Review)…చంద్రముఖి హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో మొదటి పార్ట్ లో అక్షయ్ కుమార్ నటించగా…

తర్వాత యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించగా రెండో పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇప్పుడు మూడో పార్ట్ భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు…

పెరిగిపోతున్నాయి అనే చెప్పాలి. బాలీవుడ్ లో ప్రజంట్ హర్రర్ కామెడీ జానర్ మీద ఉన్న అంచనాల దృశ్యా ట్రైలర్ పెర్ఫెక్ట్ గా కామెడీ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి కుమ్మెశారు అని చెప్పాలి. ట్రైలర్ ఫస్టాఫ్ లో కామెడీతో ఆకట్టుకుని సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి…

విద్యాబాలన్ మరియు మదూరీ దీక్షిత్ లలో అసలు మంజులిక ఎవరు అనే ఆసక్తితో ట్రైలర్ ను కట్ చేయగా ఎక్సైట్ మెంట్ తో పాటు అంచనాలను కూడా ట్రైలర్ పెంచేసింది. పండగ టైంలో ఏమాత్రం ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయినా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

పోటి లో కూడా ఈ సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఉంటుంది….మరీ స్త్రీ2 రేంజ్ కి వెళ్ళే అవకాశం లేక పోయినా కూడా సింగం అగైన్ తో పోటిలో గట్టిగానే ఈ సినిమా నిలబడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దీపావళి కానుకగా వస్తున్న భూల్ భులయ్య3 ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here