బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో గోపీచంద్ ఖాతాలో మంచి హిట్ పడి చాలా టైమే అవుతుంది అని చెప్పాలి. అప్పుడెప్పుడో 2014 టైం లో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ ని అందుకోలేదు. కానీ గోపీచంద్ కి పెర్ఫెక్ట్ కంబ్యాక్ హిట్ మూవీ గా నిలుస్తుందని పక్కా కమర్షియల్ మూవీ ని అందరూ నమ్మారు… ఎందుకంటే 2 బిగ్ బ్యానర్స్ కలిసి సినిమాను నిర్మించడం…
మినిమమ్ గ్యారెంటీ పక్కా అనుకునే రేంజ్ డైరెక్టర్ అయిన మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అవ్వడం, జనాలు డిజే టిల్లు తర్వాత మళ్ళీ మంచి ఎంటర్ కోసం ఎదురు చూస్తూ ఉండటంతో పక్కా కమర్షియల్ మూవీ కి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా…
కలిసి వచ్చే అంశం అని అందరూ అనుకున్నారు. దానికి తోడూ ఈ సినిమా కి ముందు వారాల్లో కానీ ఈ సినిమా తర్వాత 2 వారాల వరకు కానీ పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు కూడా ఏమి లేక పోవడంతో జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు గోపీచంద్ ఖాతాలో కెరీర్ బెస్ట్ నంబర్స్ ఈ సినిమా…
నమోదు చేస్తుందని అందరూ అనుకున్నప్పటికీ కూడా పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుని సోషల్ మీడియా మొత్తం అది వైరల్ లా స్ప్రెడ్ అవ్వడంతో మొదటి రోజు ఎలాగోలా మంచి కలెక్షన్స్ నే సాధించినప్పటికీ కూడా తర్వాత అసలు తేరుకోలేక పోయింది ఈ సినిమా… నిర్మాతలకు అన్నీ కలుపుకుని లాభాలు వచ్చినప్పటికీ కూడా…
గోపీచంద్ ఖాతాలో విజయంగా మాత్రం ఈ సినిమా నిలవలేక పోయింది అని చెప్పాలి. ఇక సాంగ్స్ కూడా సినిమాకి మైనస్ అని చెప్పాలి. ఇలా అన్నీ కలిపి గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సాలిడ్ హిట్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ సారి కూడా నిరాశ తప్పలేదు అని చెప్పాలి.