Home న్యూస్ హౌస్ మేట్స్ కి బ్రైన్ ఉందా లేదా?…అందరి తప్పు ఒక్కడిపై రుద్దారు!

హౌస్ మేట్స్ కి బ్రైన్ ఉందా లేదా?…అందరి తప్పు ఒక్కడిపై రుద్దారు!

0

బిగ్ బాస్ సీజన్ 2 ఎండింగ్ కి వచ్చినా ఒకరిని కార్నర్ చేయడం మాత్రం తగ్గడం లేదు…కౌశల్ తాను కార్నర్ నుండి అందరినీ చూస్తున్నాను అంటే…హోస్ట్ ఏమో నువ్వే కార్నర్ కి వెళ్లావ్ ఎవ్వరూ నిన్ను కార్నర్ చేయలేదు అని స్టేట్ మెంట్ ఇస్తాడు. ఇక్కడ హౌస్ మేట్స్ మేం తనతో ఫ్రెండ్లీగా ఉంటున్నామని చెబుతూనే అందరూ కలిసి ఒకరిని కార్నర్ చేస్తారు.

లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో రూల్స్ అందరూ సరిగ్గా పాటించని కారణంగా అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్….దానికి అందరూ కలిసి కౌశల్ వలనే అందరూ నామినేట్ అయ్యామని తమ ఒరిజినల్ క్యారెక్టర్స్ ని బయటికి తెచ్చారు.

గ్లాస్ టాస్క్ తో తనది కొద్దిగా తప్పు ఉందని ఒప్పుకుంటూ కార్ టాస్క్ లో తనేదేమీ తప్పు ఉందని అడిగిన కౌశల్ పై ఒక్కసారిగా అందరూ ఎగబడి మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వలన ఎవరికీ ఇమ్యూనిటీ రాలేదు అని తప్పు మొత్తం ఒకడిపైనే రుద్దారు.

ఇక్కడే వాళ్ళకు బుర్రలో గుజ్జు లేదని క్లియర్ గా తెలుస్తుంది…కౌశల్ కి కూడా ఈ విషయంలో తనని డిఫెండ్ చేసుకోవడం రాలేదు. ఆ టాక్స్ మీనింగ్ ఏంటి అంటే కార్ లో ఉన్న హౌస్ మేట్స్ లో ఓవరో ఒకరు చివరి బెల్ వచ్చే సమయానికి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళే టికెట్ దొరుకుతుంది.

సంచలకుడు ఎన్ని రూల్స్ పెట్టినా అవన్నీ బయటికి వాళ్ళకి కానీ, కార్ లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు నెట్టడమే, మాట్లాడి ఒప్పించడమో చేసి కార్ నుండి మిగిలిన వాళ్ళని బయటికి పంపోచ్చు. ఆ పాయింట్ ని వదిలేసి తప్పు మొత్తం సంచలకుడిదే అనడం ఏంటి.

ఇక గ్లాస్ టాస్క్ లో కూడా సంచలకుడు చెప్పే లోపే తనీష్ అమిత్ గ్లాస్ ని పడేశాడు…దాంతో మిగిలినవాళ్లు ఎవ్వరికీ ఇమ్యూనిటీ అవసరం లేదని అందరిదీ పడేశారు…మరి ఎవరి గ్లాస్ అయితే చివరి వరకు ఉంటుందో వాళ్ళే ఫైనల్ కి వెళ్తారు అని తెలిసినప్పుడు…

ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్నట్లు నటించే ఈ సభ్యులు మాట్లాడుకుని ఒకరిని ఫైనల్ కి పంపించవచ్చుగా…ఇక్కడ సంచలకుడిని నిందించడం ఎందుకు. సంచలకుడు రూల్స్ పెట్టినవి పెట్టినట్లు పాటించారా అంటే అది లేదు…మొత్తం మీద నాని వీకెండ్ లో చేసిన కామెంట్స్ పట్టుకుని టోటల్ హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయ్యామ్ అన్న అక్కసును ఒక్కడి పైనే రుద్దుతున్నారు.

అదే వ్యక్తి ఒకసారి పొరపాటున తన ప్రమేయం లేకున్నా తన పక్కనున్న దీప్తి వలన నామినేట్ అయినప్పుడు ఎంజాయ్ చేశారు. గీత ఏకంగా సీజన్ మొత్తం నామినేట్ చేస్తే ఒక్కరూ కూడా కన్సర్న్ చూపించకుండా గీతాని మెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ రూల్స్ పాటించకపోవడం వలన నామినేట్ అయితే ఒక్కడిదే తప్పని నిందిస్తున్నారు. ఇదంతా తెలిసిన హోస్ట్ వీకెండ్ వచ్చి మళ్ళీ తనకే క్లాస్ పీకుతాడు. ఏంటో ఈ సారి సీజన్ ఇలా ఉందేంటో…అసలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here