కరోనా వలన అన్ని ఇండస్ట్రీ లకు ఎదురు దెబ్బ మరో లెవల్ లో తగలగా బాలీవుడ్ కి ఇటు కరోనా దెబ్బ మరో వైపు సుశాంత్ ఫ్యాన్స్ ని విముఖత మరో లెవల్ లో తగిలాయి, కరోనా పరిస్థితుల వలన థియేటర్స్ తెరచుకోక పోవడం తో సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కానీ వాటిలో కూడా కొన్ని స్టార్ కిడ్స్ సినిమాలకు సుశాంత్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడం మనం ఇప్పటికే చూశాం.
ఇక ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ కాబోతున్న నేపధ్యంలో జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వచ్చి కొత్త సినిమాలను చూస్తారు అన్నది డౌట్ గా మారగా బాలీవుడ్ వాళ్ళు ఆ భయానికి తోడూ సుశాంత్ ఫ్యాన్స్ సినిమాలను బాయికాట్ చేస్తే పరిస్థితి ఏంటని బయపడుతున్నారు.
కాగా ఈ భయంతోనే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నా ఇయర్ ఎండ్ వరకు కూడా చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ నే నమ్ముకోగా ఓ రెండు సినిమాలు మాత్రం ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఒకటి రణవీర్ సింగ్ నటించిన 83 వరల్డ్ కప్ మూవీ కాగా…
మరోటి అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా… 83 వరల్డ్ కప్ సినిమా ఇప్పుడు క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కానుండగా అక్షయ్ కుమార్ సూర్యవంశీ వచ్చే ఇయర్ జనవరి 26 న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. కాగా ఈ రెండు సినిమాలే ఇప్పుడు జనాలను థియేటర్స్ కి తిరిగి రప్పించే భాద్యతలను తీసుకోగా సుశాంత్ ఫ్యాన్స్ ని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది…
ఈ రెండు సినిమాల రిజల్ట్ ని బట్టే ఇతర సినిమాల పరిస్థితి తెలుస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు, ఈ సినిమాలకు కలెక్షన్స్ రాకున్నా జనాలు బాయికాట్ చేసి రాకున్నా మరింత టైం తీసుకుని సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయోచ్చు అంటున్నారు. ఒకవేళ జనాలు థియేటర్స్ కి వస్తే అన్ని సినిమాలు ఎప్పటిలా రిలీజ్ అవుతాయి అంటున్నారు మరి…