ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచేవి పాన్ ఇండియా మూవీస్… వాటిలో మొదటి పార్ట్ అంచనాలను మించి సక్సెస్ అయ్యి ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సినిమా KGF చాప్టర్ 2…. రెండేళ్ళ క్రితం వచ్చిన చాప్టర్ 1 ఊహకందని విజయాన్ని నమోదు చేయగా చాప్టర్ 2 అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ ఇయర్ దసరా కి రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ అలా జరగలేదు…
కరోనా వలన అన్ని సినిమాలకు ఇబ్బంది కలిగినట్లే ఈ సినిమా కి కూడా ఎదురు దెబ్బ పడగా సినిమా ఇప్పుడు ఇయర్ ఎండ్ కి వస్తుందని టాక్ వచ్చినప్పటికీ మేకర్స్ సంక్రాంతి కి సినిమా ను ప్లాన్ చేయడం మొదలు పెట్టారు కానీ అప్ డేట్ అయితే చేయలేదు,
దానికి కారణం సినిమా లో ముఖ్య పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ఆర్యోగ్య కారణాల వల్ల ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండగా ఆ రోల్ తప్పితే మిగిలిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా డూప్ ని పెట్టి ఆ రోల్ షూటింగ్ చేయాలనీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క ఇప్పుడు…
బుక్ మై షో సినిమా రిలీజ్ డేట్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసింది… సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కాబోతుందని వాళ్ళ యాప్ లో అప్ డేట్ చేసింది, సో యూనిట్ సంక్రాంతి నే టార్గెట్ చేస్తున్నారు అని ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడం తో సోషల్ మీడియా లో సినిమా పై రచ్చ ఇప్పటి నుండే మొదలు అయింది…
థియేటర్స్ కూడా త్వరలో రీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సంక్రాంతి టైం కి జనాలు థియేటర్స్ లో వెళ్ళడం అలవాటు చేసుకుంటారు… అప్పటికి ఈ సినిమా కూడా భారీ లెవల్ లో రిలీజ్ అయితే ఆల్ ఇండియా లెవల్ లో కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పొచ్చు.