Home న్యూస్ హిందీలో KGF ఔట్….హనుమాన్ వీర విహారం సామి ఇదీ!

హిందీలో KGF ఔట్….హనుమాన్ వీర విహారం సామి ఇదీ!

0

రిలీజ్ అయిన రోజు ఈ రేంజ్ లో ఊచకోత కోస్తుందని ఎవ్వరూ ఊహించ లేదు కానీ సాలిడ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న హనుమాన్(HanuMan Movie) మరీ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ రేంజ్ లో కాకున్నా కూడా…

హిందీలో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, ఇక్కడే స్టార్ కాస్ట్ కొత్త…అలాంటిది హిందీ వాళ్ళకి సినిమాలో ఎవరు ఉన్నారో కూడా తెలియదు, కానీ హనుమాన్ పేరు, సినిమా క్లైమాక్స్ ఇచ్చిన కిక్ ఇంపాక్ట్ వలన చిన్న సినిమానే అయినా అక్కడ ఉన్నంతలో సాలిడ్ కలెక్షన్స్ ని…

HanuMan Movie 17 Days Total WW Collections!

సొంతం చేసుకుంటూ ఇప్పుడు 18 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, కాగా సినిమా హిందీలో ఊరమాస్ హిట్ గా నిలిచిన సౌత్ మూవీస్ లో ఒకటైన కేజిఎఫ్ చాప్టర్1(KGF Chapter1) మూవీ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.

కేజిఎఫ్ సినిమా కూడా చాలా అండర్ డాగ్ గా రిలీజ్ అయ్యి అప్పట్లో సంచలనం సృష్టిస్తూ 45 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, మాస్ మూవీ అవ్వడంతో జనాలలో మంచి రీచ్ సొంతం అవ్వగా ఇప్పుడు స్టార్ కాస్ట్ ఎవరికీ తెలియకున్నా సినిమా బాగుండటంతో సినిమా 45 కోట్ల మార్క్ ని దాటేసి…

బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా హిందీలో సాలిడ్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

HanuMan Movie 15 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here