బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న బిగ్ మూవీ ఆచార్య ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2000 కి పైగా థియేటర్స్ లో 132.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ 4 రోజుల ముందు నుండే మొదలు అయ్యాయి. టికెట్ హైక్స్ పర్మీషన్స్ కూడా దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక…
రచ్చ రచ్చ ఖాయం అనుకున్నా కానీ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ మాత్రం నిరాశ పరిచే విధంగానే ఉన్నాయి. రీసెంట్ బిగ్ మూవీస్ బుకింగ్స్ తో పోల్చితే ఆచార్య బుకింగ్స్ చాలా వీక్ గానే ఉన్నాయి అని చెప్పాలి. హైదరాబాదులో అడ్వాన్స్ టికెట్ సేల్స్ గ్రాస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా….
రీసెంట్ మూవీస్ కన్నా ఇది తక్కువే అని చెప్పాలి. ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కూడా బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. కారణాలు ఏమి అయినా కానీ సినిమా మొత్తం మీద మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతుంది ఇప్పుడు. కానీ టాక్ కొంచం బాగున్నా కానీ…
ఆన్ లైన్ లో కన్నా ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ రూపంలో సినిమా జోరు భారీగా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా అవన్నీ పరిగణలోకి తీసుకుంటే సినిమా మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా షో షోకి కలెక్షన్స్ లో జోరు చూపించి దుమ్ము లేపి టాక్ కూడా….
పాజిటివ్ గా సొంతం అయితే మొదటి రోజు సినిమా 28 కోట్ల కి పైగా ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది… ఇక ఇతర రాష్ట్రాలలో కేజిఎఫ్2 జోరు వలన జస్ట్ ఓకే అనిపించేలా బుకింగ్స్ ఉన్నాయి… మొత్తం మీద బుకింగ్స్ అయితే మైండ్ బ్లాంక్ చేసినా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ లు ఆఫ్ లైన్ లో మ్యాజిక్ చూపించి కౌంటర్ సేల్స్ తో మొదటి రోజు ఏ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటారో చూడాలి ఇక…