Home న్యూస్ బోయపాటి డైలాగ్ కి…ఫ్యాన్స్ గుండెల్లో గుబులు…మ్యాటర్ ఏంటంటే!

బోయపాటి డైలాగ్ కి…ఫ్యాన్స్ గుండెల్లో గుబులు…మ్యాటర్ ఏంటంటే!

0

ఎవరి సినిమా గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం అన్నది సర్వ సాదారణంగా జరుగుతూనే ఉంటుంది, కానీ సినిమా ఎంత పబ్లిసిటీ చేస్తే బాగుంటుందో అంతే చేస్తేనే అందంగా ఉంటుంది, కానీ ఓవర్ గా ప్రమోషన్ కానీ డైలాగ్స్ కానీ కొడితే… ఆ డైలాగ్ కి తగ్గట్లు సినిమా ఉంటే ఇదిరా కాన్ఫిడెంట్స్ అంటే అనుకుంటారు, అలా జరగక పొతే చూశారా ఓవర్ కాన్ఫిడెంట్స్ అంటూ ట్రోల్ కి గురి అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ. బాలయ్య బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

   

గ్రాండ్ గా చేయగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది అని చెప్పాలి. కాగా ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తుంది అని చెప్పాలి. బోయపాటి శ్రీను కెరీర్ లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ మూవీగా…

రామ్ చరణ్ తో చేసిన వినయ విదేయ రామ సినిమా నిలుస్తుంది, ఆ సినిమా రిలీజ్ టైం లో తెగ ట్రోల్స్ కూడా జరిగాయి, కాగా వినయ విదేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి గుండెల మీద చెయ్యి వేసుకుని అభిమానులు వినయ విధేయ రామ సినిమా చూడవచ్చని స్టేట్ మెంట్ బోయ…కట్ చేస్తే….

ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే… మళ్ళీ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ తో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని అభిమానులు అఖండ సినిమా చూడవచ్చని బోయపాటి శ్రీను స్టేట్ మెంట్ ఇచ్చారు. దాంతో ఆప్పుడిచ్చిన స్టేట్ మెంట్ నే మళ్ళీ బోయపాటి ఇచ్చాడు… ఇది కాన్ఫిడెంటా లేక ఓవర్ కాన్ఫిడెంటా అన్నది అఖండ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అంటూ సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here